Ravi Teja: సంచలన నిర్ణయం.. రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి!

ABN , First Publish Date - 2022-08-06T01:42:17+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) చిత్రానికి సంబంధించి తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని..

Ravi Teja: సంచలన నిర్ణయం.. రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి!

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) చిత్రానికి సంబంధించి తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం నిర్మాతలకు, సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్లే. ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood)లోని హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలంటూ.. ఫిల్మ్ చాంబర్ (Film Chamber) చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తన సినిమా ఫ్లాప్‌కి బాధ్యత వహిస్తూ.. రవితేజ తీసుకున్న నిర్ణయం.. అందరికీ ఆదర్శంగా మారకపోదు. మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమాకి రవితేజ కూడా ఒక నిర్మాత. ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్ బ్యానర్లపై ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి రవితేజ రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాక్ ఉండగా.. జూలై 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూడటంతో.. ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని రవితేజ వెనక్కి ఇచ్చేసినట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 


వాస్తవానికి ఈ చిత్రం రూ. 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. ఫస్ట్ వీక్ కేవలం రూ. 5 కోట్ల (షేర్) కలెక్షన్ మాత్రమే వచ్చినట్లుగా సమాచారం. సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోనూ కలెక్షన్లు వీక్‌గానే ఉండటంతో.. ఫుల్ రన్ ముగిసే సరికి.. దాదాపు రూ. 13 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో.. తను కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కారణంగా.. రవితేజ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. గతంలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కూడా తన సినిమాలు సరిగా ఆడనప్పుడు.. తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసేవాడని, లేదంటే.. మరో సినిమా ఆ నిర్మాతకి చేస్తానని మాటిచ్చేవాడని టాక్ ఉండేది. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సినిమాలు సరిగా ఆడనప్పుడు.. తమ రెమ్యూనరేషన్‌లో కొంత మేర నిర్మాతలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడా లిస్ట్‌లోకి రవితేజ కూడా చేరినట్లైంది. కాగా, ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘ధమాకా’ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న  చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Updated Date - 2022-08-06T01:42:17+05:30 IST