Slumdog Husband: తెలంగాణ యాసలో పెళ్లి సాంగ్

ABN , First Publish Date - 2022-09-22T21:28:12+05:30 IST

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) కుమారుడు సంజయ్ (Sanjay) నటిస్తున్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' ఒక ఎంటర్ టైన్ మెంట్ సినిమా అని ఆ సినిమాలోంచి విడుదల అయిన సాంగ్ వల్ల తెలుస్తోంది.

Slumdog Husband: తెలంగాణ యాసలో పెళ్లి సాంగ్

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) కుమారుడు సంజయ్ రావ్ (Sanjay) నటిస్తున్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' ఒక ఎంటర్ టైన్ మెంట్ సినిమా అని ఆ సినిమాలోంచి విడుదల అయిన సాంగ్ వల్ల తెలుస్తోంది. ఏ ఆర్ శ్రీధర్ (A R Sridhar) ఈ సినిమాతో దర్శకుడిగా (Director) పరిచయం అవుతున్నాడు. అతను ఇంతకు ముందు పూరి జగన్నాథ్ (Puri Jagannath) దగ్గర పని చేసాడు. ఈ సినిమా నుండి లచ్చి గాని పెళ్లి  అనే పాటని మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) విడుదల చేసాడు. ఈ పాట మొత్తం తెలంగాణ యాసలో (Telangana dialect) హుషారుగా సాగుతోంది. ఈ పాట విన్నాక, ఈ సినిమా కామెడీ సినిమాగా ఉండొచ్చని అనిపిస్తూ ఉంటుంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ (Kasarla Syam) రాశారు, అలాగే భీమ్స్ సిసిరోలియో (Bheems) సంగీతం అందించారు. వీరిద్దరూ ఈమధ్య క్రేజీ పాటలు రాస్తున్నారు అన్న పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో కూడా పాటలు క్రేజీ గా వుండబోతోంది అనిపించేలా ఈ పాట వుంది. ఇందులో ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) కథానాయికగా నటిస్తోంది. సంజయ్ తో పాటు అతని ఫాదర్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవటం అయిపోయిందని, ఇంక విడుదలకు సిద్ధంగా ఉందని కూడా తెలిసింది. 

Updated Date - 2022-09-22T21:28:12+05:30 IST