Ramarao On Duty ట్రైలర్: అసలు వేట మొదలైంది

ABN , First Publish Date - 2022-07-17T00:49:46+05:30 IST

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ వచ్చేసింది. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను

Ramarao On Duty ట్రైలర్: అసలు వేట మొదలైంది

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) ట్రైలర్ వచ్చేసింది.  జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రజిషా విజయన్ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌ (Divyasha Kaushik) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేదిగా ఉంది. (Ramarao On Duty Trailer)


ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘ఈ ఆపరేషన్ ‘మయం’లో గల్లంతైంది వేరు వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు’’ అనే సైడ్ వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో.. ఓ పాప ‘మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా?’ అని ధీనంగా అడుగుతున్న డైలాగ్‌తో రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీని చూపించారు. ‘ఇన్నాళ్లు ఓ గవర్నమెంట్ ఆఫీసర్‌గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇకపై రామారావుగా ధర్మకోసం డ్యూటీ చేస్తాను’ అని రవితేజ చెప్పే డైలాగ్, హీరోయిన్లతో రవితేజ చేసే రొమన్స్, ఆ తర్వాత వచ్చే పోరాట సన్నివేశాలు.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మిస్సింగ్ కేసుల నేపథ్యంలో భారీ తారాగణంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. రవితేజ ‘క్రాక్’‌కు కంటిన్యూ ఫిల్మ్ అనేలా ఉంది. ఇక ట్రైలర్ చివరిలో రవితేజ చెప్పిన ‘అసలు వేట మొదలైంది’ డైలాగ్ వింటుంటే.. రామారావుగా రవితేజ బాక్సాఫీస్‌పై వేటకు బయలుదేరినట్లుగానే అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ ట్రైలర్ సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేదిగా అయితే ఉంది. (Ramarao On Duty Trailer)


కాగా, 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చుతుండగా.. సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.



Updated Date - 2022-07-17T00:49:46+05:30 IST