Dhamaka: ‘జింతాక్’తో దుమ్మురేపుతోన్న రవితేజ, శ్రీలీల

ABN , First Publish Date - 2022-08-18T23:20:03+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), ఛార్మింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ధమాకా’ (Dhamaka). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్

Dhamaka: ‘జింతాక్’తో దుమ్మురేపుతోన్న రవితేజ, శ్రీలీల

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), ఛార్మింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ధమాకా’ (Dhamaka). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సింగిల్ ‘జింతాక్’ (Jinthaak) అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన బీట్స్ సరికొత్తగా ఉండగా.. ఈ పాటను మంగ్లీతో కలిసి ఆయనే ఆలపించారు. సామూహిక, జానపద నృత్య రీతిలో.. మంచి పెప్సీ సాంగ్‌గా ఈ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.


‘‘నిన్ను సూడబుద్దవుతాంది రాజిగో..

మాటాడబుద్దవుతాంది రాజిగో..

చెయ్, పట్టబుద్దవుతాంది రాజిగో..

ముద్దు పెట్టబుద్దవుతాంది రాజీగో..


అట్ట అంటుంటే మస్తుంది ఓ పిల్లో..

లవ్వు తన్నుకు వస్తుంది టన్నుల్లో..

భూమి పూజ చేసుకుంట బుగ్గల్లో..

కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో.. అంటూ సాగిన ఈ పాటలో రవితేజ, శ్రీలీలల మేకోవర్, మాస్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పర్ఫెక్ట్ ఫోక్ సాంగ్‌గా అలరిస్తోన్న ఈ పాటలో రవితేజ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌గా ‘డబుల్ ఇంపాక్ట్’ అని వాడారు. అది ఈ పాట రెస్పాన్స్‌కి పర్ఫెక్ట్‌గా సూటయ్యేలా.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పాటకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రయూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. పాట చిత్రీకరణకు పనిచేసిన వారికి, ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా,  ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు అందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతని నిర్వహిస్తున్నారు. (Dhamaka Jinthaak Lyrical Song)



Updated Date - 2022-08-18T23:20:03+05:30 IST