ఆ దీపావళిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను: Raveena Tandon

ABN , First Publish Date - 2021-11-04T20:11:18+05:30 IST

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రవీనా టాండన్.

ఆ దీపావళిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను: Raveena Tandon

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రవీనా టాండన్. 1991లో తెరంగేట్రం చేసిన రవీనా దాదాపు దశాబ్దం పాటు ప్రముఖ కథానాయికగా వెలుగొందింది. పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. 2004లో అనిల్ తడానీని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అలాగే మరో ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుంది. దీపావళి సందర్భంగానే తన భర్త తనకు ప్రపోజ్ చేశాడని, ఆ సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 


`2003 అక్టోబర్ 26.. ఆ రోజు దీపావళి. అదే రోజు నా జన్మదినోత్సవం కూడా. దాంతో మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. నాకు తెలియకుండా ఆ రోజు సాయంత్రం అనిల్ ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి అనిల్ తల్లిదండ్రులు వచ్చారు. ఇద్దరి కుటుంబ సభ్యులు ఉండగా అనిల్ నా ముందుకు వచ్చి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. తనని పెళ్లి చేసుకొమ్మని అడిగాడు. దాంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అది జరిగిన కొద్ది నెలలకే మా వివాహం జరిగిపోయింద`ని రవీనా చెప్పింది. 

Updated Date - 2021-11-04T20:11:18+05:30 IST