‘భవదీయుడు భగత్‌సింగ్‌’లో రమికా సేన్ ?

ABN , First Publish Date - 2022-04-24T17:25:21+05:30 IST

బాలీవుడ్ నిన్నటి తరం బ్యూటీ ‘రవీనా టండన్’.. తాజాగా ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఒక విధంగా ఆమె చేసింది ఇందిరాగాంధి పాత్ర. డబ్బైల్లో జరిగిన కథ కావడంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి కాబట్టి.. ఆమె పోషించింది ఆవిడ పాత్రనే అనే క్లారిటీకి వచ్చారు ప్రేక్షకులు. ఆ పాత్రలో ఆమె అగ్రెసివ్ నెస్, డిక్టేటర్ షిప్, పెర్పార్మెన్స్ మెప్పిస్తాయి.

‘భవదీయుడు భగత్‌సింగ్‌’లో రమికా సేన్ ?

బాలీవుడ్ నిన్నటి తరం బ్యూటీ ‘రవీనా టండన్’.. తాజాగా ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఒక విధంగా ఆమె చేసింది ఇందిరాగాంధి పాత్ర. డబ్బైల్లో జరిగిన కథ కావడంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి కాబట్టి.. ఆమె పోషించింది ఆవిడ పాత్రనే అనే క్లారిటీకి వచ్చారు ప్రేక్షకులు. ఆ పాత్రలో ఆమె అగ్రెసివ్ నెస్, డిక్టేటర్ షిప్, పెర్పార్మెన్స్ మెప్పిస్తాయి. ఈ సినిమాతో రవీనాకి మంచి పేరు రావడంతో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంలో ఆమెకి స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడట హరీశ్. పాత్ర నచ్చడంతో రవీనా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 


గతంలో రవీనాటండన్ తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి సినిమాల్లో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత చాన్నాళ్ళకు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమాతో రవీనాటండన్ మళ్ళీ తెలుగు సినిమాల్లో బిజీ అవుతారేమో చూడాలి.   

Updated Date - 2022-04-24T17:25:21+05:30 IST