బిగ్ బీ అలాంటి వాడు కాదంటోన్న బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2021-10-12T04:20:49+05:30 IST

అమితాబ్ బచ్చన్ 79వ జన్మదినం వేళ అలనాటి హిందీ నటి రతీ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

బిగ్ బీ అలాంటి వాడు కాదంటోన్న బాలీవుడ్ బ్యూటీ

అమితాబ్ బచ్చన్ 79వ జన్మదినం వేళ అలనాటి హిందీ నటి రతీ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బిగ్ బి అహంభావి కాదని చెబుతూనే ఆయన పెద్దగా జనంతో కలిసిపోయే వ్యక్తి కాదని వివరించింది. అమితాబ్ ‘రిజర్వ్‌డ్’గా ఉంటాడని రతీ తెలిపింది. 


ఒక నటుడిగా బచ్చన్ ఎదుటి వార్ని భయపెట్టేలా ఎప్పుడూ ప్రవర్తించడని కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఆయన ఎప్పుడూ ఎదుటి వారు తక్కువగా ఫీలయ్యేలా చేయడని కితాబునిచ్చింది. అమితాబ్ ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఎంతో మర్యాదగా చెబుతారని రతీ అంటోంది.    

Updated Date - 2021-10-12T04:20:49+05:30 IST