సినిమా కోసం రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-06T05:48:44+05:30 IST

‘కట్టప్ప’ సత్యరాజ్‌ కుమారుడు సిబిరాజ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘మాయెన్‌’ హక్కులు కొని అదే పేరుతో గురువారం తెలుగు రాష్ట్రాల్లో విడుదల...

సినిమా కోసం రథయాత్ర

‘కట్టప్ప’ సత్యరాజ్‌ కుమారుడు సిబిరాజ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘మాయెన్‌’ హక్కులు కొని అదే పేరుతో గురువారం తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు మూవీ మ్యాక్స్‌ సంస్థ అధినేత మామిడాల శ్రీనివాస్‌. ఆయన చిత్ర విశేషాలు వెల్లడిస్తూ ‘మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇది. విజువల్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తాయి. రామ్‌ప్రసాద్‌ ఫొటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాయి. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన  నేపథ్యంలో  హై టెక్నికల్‌ వాల్యూ్‌సతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రభా్‌స సినిమా గురించి ట్వీట్‌ చేయడం హ్యాపీ అనిపించింది. సినిమాకు ‘మాయెన్‌’ అని పేరు పెట్టడం కూడా ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయింది. మాయోన్‌ అనేది చాలా పురాతన పదం. శ్రీకృష్ణునికి సంబంధించిన పదం. అందుకే శ్రీకృష్ణుడి విగ్రహంతో రథయాత్రను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాం. ఈ నెల 7న విడుదలవుతున్న  మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. కిశోర్‌ ఎన్‌  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Updated Date - 2022-07-06T05:48:44+05:30 IST