Rashmika Mandanna: శ్రీ వల్లీ చీరకు ఫుల్ డిమాండ్

ABN , First Publish Date - 2022-09-15T21:11:27+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోహీరోయిన్‌గా నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా

Rashmika Mandanna: శ్రీ వల్లీ చీరకు ఫుల్ డిమాండ్

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోహీరోయిన్‌గా నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). లెక్కల మాస్టారు  సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌లో రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప’ తో బన్నీ, రష్మికల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలోని పాటలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో సాంగ్స్ ఇప్పటికీ  మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘శ్రీ వల్లీ’ పాటకు అభిమానులు అందరు ఫిదా అయ్యారు. నెటిజన్స్ అప్పట్లో రీల్స్ చేసి హల్‌చల్ చేశారు. సినిమా విడుదలై తొమ్మిది నెలలైనా ఆ పాటకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. ఆ పాటలో రష్మిక ధరించిన చీరకు ఇప్పటికి ఫుల్ డిమాండ్ ఉంది. ఈ శారీని కొనుగోలు చేయడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. 


రష్మిక మందన్న ‘శ్రీ వల్లీ’ (Srivalli) పాటలో ఎరుపు రంగు చీర ధరించి డ్యాన్స్ చేసింది. తన స్టెప్పులతో అభిమానులను ఫిదా చేసింది. ఈ శారీని కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జైపూర్‌లోని ఓ షాపు శ్రీ వల్లీ పాటలోని చీరకు దగ్గరి పోలికలున్న శారీని అమ్మకానికి పెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక మందన్న అభిమానులు సైతం ఈ పిక్స్‌ను షేర్ చేస్తున్నారు. ‘పుష్ప’ తో రష్మిక క్రేజ్ ఉత్తరాదికి కూడా పాకింది. త్వరలోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ షూటింగ్స్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సినిమాలు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

Updated Date - 2022-09-15T21:11:27+05:30 IST