తన పెట్ డాగ్‌పై వచ్చిన రూమర్‌ను ఖండించిన Rashmika Mandanna

ABN , First Publish Date - 2022-06-25T18:20:05+05:30 IST

ప్రస్తుతం దక్షిణాది కథానాయికల్లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ రష్మికా మందణ్ణ. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘పుష్ప 2, వారసుడు, సీతారామం’ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ లో ‘యానిమల్, మిషన్ మజ్ను’ మూవీస్ లో రష్మాకి కథానాయికగా నటిస్తోంది.

తన పెట్ డాగ్‌పై వచ్చిన రూమర్‌ను ఖండించిన Rashmika Mandanna

ప్రస్తుతం దక్షిణాది టాప్ కథానాయికల్లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ రష్మికా మందణ్ణ. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘పుష్ప 2, వారసుడు, సీతారామం’ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ లో ‘యానిమల్, మిషన్ మజ్ను’ మూవీస్‌లో రష్మిక కథానాయికగా నటిస్తోంది. సినిమాలతో పాటు అమ్మడికి మరో వ్యాపకం సోషల్ మీడియా. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తన అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే.. గ్లామరస్ ఫోటోస్ తో నెటిజెన్స్ కు కనువిందు చేస్తూ ఉంటుంది. అలాంటి రష్మికా మందణ్ణ తనపై వచ్చిన ఒక రూమర్ కు.. అందులోనూ తన పెట్ డాగ్ ‘ఆరా’పై వచ్చిన వార్తకు స్పందిస్తూ.. ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 


అగ్ర నటీనటులు షూటింగ్స్ కోసం ఫ్లైట్ జెర్నీ చేస్తారని తెలిసిందే. అయితే కొందరు సెలబ్రిటీస్ తమ వెంట పెట్ డాగ్స్‌ను కూడా వెంటతీసుకెళ్తూ ఉంటారు.వాటికి విమానాల్లో అదనపు చార్జ్ వసూలు చేస్తూంటారు. కొందరు హీరోయిన్స్ వాటికి కూడా టికెట్స్ పంపమని నిర్మాతల్ని డిమాండ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రష్మికా మందణ్ణ కూడా తన పెట్ డాగ్ ‘ఆరా’ కోసం నిర్మాతల్ని టికెట్ వేయమని డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో ఒక వార్త స్ప్రెడ్ అయింది. రష్మికా తన పెట్ డాగ్ ఆరా తను లేకుండా ఉండలేదని, అందుకే ఫ్లైట్ టికెట్ డిమాండ్ చేసిందని ఆ వార్త సారాంశం. ఆ వార్తను ఖండిస్తూ..  రష్మికా దానికి ఘాటు రిప్లై ఇచ్చింది.  


‘మీరు చెప్పింది చాలా సిల్లీగా ఉంది. ఒకవేళ ‘ఆరా’ నాతో విమానంలో ప్రయాణం చేయాలని మీరు కోరుకున్నా ..అది నాతో ప్రయాణించాలని మాత్రం అనుకోదు. హైదరాబాద్ లోనే అది సంతోషంగా ఉంటుంది. మీరు తీసుకున్న శ్రమకు ధన్యవాదాలు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ వార్తను ట్యాగ్ చేస్తూ మరీ రష్మికా ఇచ్చిన రిప్లై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.   



Updated Date - 2022-06-25T18:20:05+05:30 IST