పొట్టి డ్రస్సులో ‘రారా సామి’ అంటూ రష్మిక స్టెప్.. ఇన్‌స్టా షేకవుతోంది

ABN , First Publish Date - 2021-12-15T01:59:32+05:30 IST

ఏయ్ బిడ్డా, రారా సామి, శ్రీవల్లి, ఊ అంటావా మావా, దాక్కో దాక్కో మేక.. ఇలా వేటికవే పోటీలా ఇప్పుడు శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఇందులో ‘రారా సామి’ పాట అయితే.. ఒక్కసారి వింటే రోజంతా మైండ్‌లో మెదులుతూనే ఉండేలా దేవిశ్రీ కంపోజ్ చేశారు. ఇప్పుడీ పాటతోనే హీరోయిన్ రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రమ్‌ని షేక్ చేస్తోంది. అదెలా అంటే..

పొట్టి డ్రస్సులో ‘రారా సామి’ అంటూ రష్మిక స్టెప్.. ఇన్‌స్టా షేకవుతోంది

ఇప్పుడు ఎక్కడ విన్నా ‘పుష్ప’ పాటల సందడే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. చంద్రబోస్ సాహిత్యం, రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతంతో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఏయ్ బిడ్డా, రారా సామి, శ్రీవల్లి, ఊ అంటావా మావా, దాక్కో దాక్కో మేక.. ఇలా వేటికవే పోటీలా ఇప్పుడు శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఇందులో ‘రారా సామి’ పాట అయితే.. ఒక్కసారి వింటే రోజంతా మైండ్‌లో మెదులుతూనే ఉండేలా దేవిశ్రీ కంపోజ్ చేశారు. ఇప్పుడీ పాటతోనే హీరోయిన్ రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రమ్‌ని షేక్ చేస్తోంది.


పొట్టి డ్రస్సులో... సినిమాలో ‘రారా సామి’ పాటకు వేసిన స్టెప్‌‌తో ఓ వీడియోని రష్మిక తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు ‘‘చాలా మంది ఈ స్టెప్ వేయడం నేను గమనించాను. అందుకే నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. నేను కూడా ఈ స్టెప్ వేసి పార్టీలో చేరుతున్నాను. ఈ స్టెప్ వేసి ఇంకా ఎందరో ఈ పార్టీలో చేయాలని ఆశిస్తున్నాను..’’ అని తెలిపింది. ఆమె చెప్పిన విషయం పక్కన పెడితే.. హాట్ హాట్‌గా ఆమె వేసిన ఈ స్టెప్ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక చేసిన ఈ పోస్ట్‌.. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించింది అంటే.. ఈ వీడియోలో ఉన్న హాట్‌నెస్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 



Updated Date - 2021-12-15T01:59:32+05:30 IST