Rashmika Mandanna: ‘గుడ్ బై’ విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-07-23T23:25:56+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న అందాల భామ రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘పుప్ప’(Pushpa) లో శ్రీవల్లీగా నటించి అభిమానులను మెప్పించింది. ఉత్తరాది

Rashmika Mandanna: ‘గుడ్ బై’ విడుదల తేదీ ఖరారు

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న అందాల భామ రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘పుప్ప’(Pushpa) లో శ్రీవల్లీగా నటించి అభిమానులను మెప్పించింది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రేక్షకులకు చేరువైంది. రష్మికకు బాలీవుడ్‌లో ఆఫర్స్ వరుసగా తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’(Goodbye) వంటి సినిమాల చిత్రీకరణలను పూర్తి చేసింది. ఈ చిత్రాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. తాజాగా ‘గుడ్ బై’ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. 


‘గుడ్ బై’ కామెడీ-డ్రామాగా రూపొందింది. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), రష్మిక మందన్న, నీనా గుప్తా, ఎల్లీ అవ్రాం, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘గుడ్ బై’ కు వికాస్ బహల్ (Vikas Bahl) దర్శకత్వం వహించాడు. ఏక్తా కపూర్ నిర్మించింది. అంత్యక్రియల చుట్టూ ఈ కథ తిరుగుతుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. రష్మిక మందన్న ‘గుడ్ బై’ (Goodbye) షూటింగ్‌ను జూన్ 24న ముగించింది. దీంతో చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘చిత్రీకరణను ముగించేశాను. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి రెండేళ్లయింది. కోవిడ్‌తో సహా ఏది కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా ఆపలేకపోయింది. ‘గుడ్ బై’ సినిమా ఫన్‌గా ఉంటుంది. నవ్వడానికి కొంచెం సిద్ధంగా ఉండండి. అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. మీరు ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు. నువ్వు ఈ ప్రత్యేకమైన సినిమాలో నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావో దేవుణ్నికే తెలుసు. నువ్వు గర్వించేలా నటించానని నేను అనుకుంటున్నాను. నీనా గుప్తాను మిస్ అవుతున్నాను. నేను ఇంకా ఎంత సేపు అయినా చెప్పగలను. కానీ, ఇక్కడే ఆపుతున్నాను. సినిమా చూడటానికి అందరు సిద్ధంగా ఉండండి’’ అని రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 



Updated Date - 2022-07-23T23:25:56+05:30 IST