Rashmika Mandanna: ఆ పాపను చూ‌సి రష్మిక ఫిదా.. అడ్రస్ కావాలంటూ..!

ABN , First Publish Date - 2022-09-15T00:35:57+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ఈ చిత్రం సృష్టించిన

Rashmika Mandanna: ఆ పాపను చూ‌సి రష్మిక ఫిదా.. అడ్రస్ కావాలంటూ..!

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ఈ చిత్రం సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అల్లు అర్జున్‌కి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిందీ సినిమా. ఇందులోని పాటలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో తెలియంది కాదు. ఇప్పటికీ ‘పుష్ప’ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘నా సామి రారా సామి’ అనే సాంగ్‌, ఆ సాంగ్‌లో రష్మిక మందన్నా నడుం వంచి వేసిన స్టెప్పుపై సోషల్ మాధ్యమాలలో ఎన్ని రీల్స్ వచ్చాయో లెక్కే లేదు. రీల్స్ పరంగానూ రికార్డ్ కొట్టిన పాట ఏదైనా ఉందీ అంటే.. అది ఖచ్చితంగా ‘పుష్ప’లోని నా సామి పాట అని చెప్పుకోవచ్చు. ఇప్పుడీ పాటపై ఓ స్కూల్ పాప చేసిన డ్యాన్స్ వీడియో.. సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పాప డ్యాన్స్‌కి రష్మిక మందన్నా కూడా ఫిదా అయిందంటే ఏ రేంజ్‌లో ఆ పాప డ్యాన్స్ ఇరగ దీసిందో అర్థం చేసుకోవచ్చు. (Pushpa Song)


వైరల్ అవుతున్న ఆ పాప డ్యాన్స్ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన రష్మిక మందన్నా.. ‘ఈరోజుకి నాకిది చాలు.. ఈ క్యూటీని నేను అర్జెంట్‌గా కలవాలి. ఎలా కలవాలి?’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రష్మిక అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆ పాపది నేపాల్ అంటూ ఓ నెటిజన్ స్పందించాడు కూడా. ‘‘ఆ పాపని కలవాలంటే మీరు నేపాల్ రావాలి. ఆ పాపది నేపాల్‌లోని మాక్వాన్‌పూర్’’ అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్.. ‘మీకంటే ఆ పాపే డ్యాన్స్ బాగా చేసింది’ అంటూ కామెంట్ చేసి రష్మికకు, ఆమె అభిమానులకు షాకిచ్చాడు. ఆ పాప పక్కన ఉన్న మరో పాప కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది.. ఆ పాపని మీరు మిస్సయ్యారంటూ.. ఇంకో పాపకి సంబంధించిన వీడియోను కూడా ఇంకో నెటిజన్ పోస్ట్ చేశారు. ఇలా నెటిజన్లే కాదు.. దర్శకుడు ఎస్.జె. సూర్య కూడా ఈ పాప డ్యాన్స్‌కి ఫిదా అయిపోయారు. ‘లవ్ యూ బేబీ.. క్యూట్ క్యూట్’ అంటూ అల్లు అర్జున్, రష్మికలకు ఈ వీడియోని ట్యాగ్ చేశారు. ఇలా ఎందరో  ఈ పాప డ్యాన్స్‌ని మెచ్చుకుంటూ.. సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. రీ ట్వీట్స్, లైక్స్‌తో ఈ వీడియో ఇప్పుడు ట్రైండ్ అవుతోంది. (Baby Dance Video)



Updated Date - 2022-09-15T00:35:57+05:30 IST