Rashmika Mandanna : మీలో చాలా మందికి నచ్చదు... మొదట్లో బోర్ కొడుతుంది... అలవాటైతే మాత్రం...

ABN , First Publish Date - 2022-03-26T23:16:05+05:30 IST

‘‘ఈ ఫోటో పోస్టు చేస్తున్నాను. కానీ, ఈ విధంగా చేయవచ్చో లేదో నాకైతే తెలియదు. మీలో చాలా మందికి నచ్చదని కూడా నాకు తెలుసు. అయినా ఎందుకు పోస్టు చేస్తున్నానంటే... ’’ అంటోంది రశ్మిక మందణ్ణ

Rashmika Mandanna : మీలో చాలా మందికి నచ్చదు... మొదట్లో బోర్ కొడుతుంది... అలవాటైతే మాత్రం...

‘‘ఈ ఫోటో పోస్టు చేస్తున్నాను. కానీ, ఈ విధంగా చేయవచ్చో లేదో నాకైతే తెలియదు. మీలో చాలా మందికి నచ్చదని కూడా నాకు తెలుసు. అయినా ఎందుకు పోస్టు చేస్తున్నానంటే... ఫిట్‌నెస్‌కి మూలం కన్‌సిస్టెన్సీయే అని చెప్పేందు కోసమే...’’ అంటోంది రశ్మిక మందణ్ణ. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన జిమ్ సెషన్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. బ్లాక్ స్పోర్ట్స్ బ్రా ధరించి, మెరూన్ యోగా ప్యాంట్స్‌తో పిక్చర్ పర్‌ఫెక్ట్‌గా ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టు కనిపించింది బెంగుళూరు బ్యూటీ!


రశ్మిక లెటెస్ట్ ఇన్‌స్టా పిక్‌లో అసలు విశేషం ఆమె యాబ్స్! హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యతనిచ్చే ‘పుష్ప’ బ్యూటీ నడుము, పొట్ట వద్ద సొగసులతో కుర్రాళ్ల చేత నీళ్లు నమిలిస్తోంది! అయితే, తన జిమ్ లుక్‌తో పాటూ చిన్నపాటి మెసేజ్ కూడా అందించింది అందాల చిన్నది. వర్కవుట్స్, ఫిజియోస్, డైట్స్, థాట్స్, జర్నీ... వీటన్నటి విషయంలో కన్‌సిస్టెన్సీ అవసరం అంటోంది రశ్మిక. ‘స్థిరత్వం’ ఉంటే ఏదైనా మొదట్లో ఆనందకరంగా అనిపించకున్నా... పోనుపోను అందులోని మజా ఏంటో మనకే తెలుస్తుందని వివరించింది. చూడాలి మరి, ప్రస్తుతం తెలుగుతో పాటూ హిందీ చిత్రాలు కూడా చేస్తోన్న రశ్మిక ‘నేషనల్ క్రష్’ మారిపోయింది. ఆమె జిమ్ పాఠాలు ఎందరు నెటిజన్స్ అమల్లో పెడతారో!  

Updated Date - 2022-03-26T23:16:05+05:30 IST