Rashmika Mandanna: అప్పుడే నాకు సంతృప్తి..

ABN , First Publish Date - 2022-08-03T19:35:04+05:30 IST

నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి..అప్పుడే నాకు సంతృప్తి అన్నారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఆమె కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం సీతారామం (Sita Ramam).

Rashmika Mandanna: అప్పుడే నాకు సంతృప్తి..

"నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి..అప్పుడే నాకు సంతృప్తి" అన్నారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఆమె కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం సీతారామం (Sita Ramam). మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ఇది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న థియేటర్స్ లో రాబోతోంది.  


ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రలో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.."నేను నటిస్తున్న సినిమాలలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి. అప్పుడే నాకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. అందుకే తమిళ, మలయాళ భాషలు కూడా నేర్చుకుని డబ్బింగ్ చెబుతున్నాను. ఒక వైపున షూటింగులు.. మరో వైపు డబ్బింగులు.. భాషలు నేర్చుకునే క్లాసులు. సమయం సరిపోవడం లేదు రోజుకు 36 గంటలుంటే బాగుండునని అనిపిస్తోంది.


ఇక ఈ సినిమాలో, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను.. నాకు తోచినట్టు చేస్తాను.. అనేలా ఉండే పాత్రలో కనిపిస్తాను. 1964 నాటి వాతావరణం కనిపించేలా చిత్రీకరణ చేయడానికి చాలా కష్టపడ్డారు. రష్యా, కశ్మీర్ వంటి ప్రదేశాల్లో విపరీతమైన చలిలో షూటింగ్ చేశాము. ఈ సినిమాలో నేను దుల్కర్ కాంబినేషన్లో కనిపించను. ఆయనతో కలిసి నటించే అవకాశం త్వరలో రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-08-03T19:35:04+05:30 IST