స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) గత కొన్నేళ్ళుగా చేయాలనుకుంటున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' (Janaganamana). ఈ సినిమాను ముందు మహేష్ బాబు (Mahesh Babu)తో చేయాలనుకున్నారు. కానీ, ఎందుకో ఆయనకు ఈ కథ నచ్చక ఆగిపోయింది. అలా చాలా ఏళ్ళుగా ఎదురుచూసిన పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఫైనల్‌గా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఎంచుకున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde)నటిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై పూరి జగన్నాథ్, దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally), ఛార్మి కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' లాంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 'గీత గోవిందం' భారీ హిట్ సాధించగా, 'డియర్ కామ్రేడ్' మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
మళ్ళీ ఇంతకాలానికి కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారట విజయ్ - రష్మిక. పూరి జగన్నాథ్ సినిమా అంటే ఏ హీరోయిన్ కూడా అంత ఈజీగా నో అని చెప్పదు. రష్మిక కూడా పూరి - విజయ్ దేవరకొండ సినిమా కాబట్టే స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒకే చెప్పిందని సమాచారం. త్వరలో దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రానుందట. కాగా, రష్మిక ఇటు తెలుగు అటు హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగా ఉంటుంది. ఇక పూరి - విజయ్ కాంబినేషన్‌లో రూపొందున్న లైగర్ సినిమా ఈ ఆగస్టులో 25వ తేదీన రిలీజ్ కాబోతోంది. అనన్య పాండే హీరోయిన్.