కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక మందన్న.. లుక్ వైరల్

ABN , First Publish Date - 2022-04-06T01:19:34+05:30 IST

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రొడక్షన్ నెం 7గా రూపొందుతోన్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా

కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక మందన్న.. లుక్ వైరల్

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రొడక్షన్ నెం 7గా రూపొందుతోన్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా సీత పాత్రలో కనిపించనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 5, ఆమె పుట్టినరోజు సందర్భంగా.. ఈ చిత్రంలో ఆమె భాగం అవుతుందని తెలుపుతూ.. మేకర్స్ ఆమె లుక్‌ని విడుదల చేశారు.


ఆమె లుక్ చూస్తుంటే ఇది రెగ్యులర్ పాత్ర కాదనేది సుస్పష్టమవుతోంది. అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక ఇందులో వీరోచిత పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది. పాత్రను పరిచయం చేసే గ్లింప్స్‌లో రష్మిక మందన్న కాలిపోతున్న కారు ముందు నడుస్తూ ఉంది. ఎరుపు రంగు హిజాబ్ ధరించి ఉన్న ఆమె కళ్లలోని సీరియస్ నెస్, తీవ్రతను చూస్తుంటే ఇదేదో మతకల్లోలానికి సంబంధించిన సన్నివేశంగా అనిపిస్తుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. కాగా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.



Updated Date - 2022-04-06T01:19:34+05:30 IST