Rashmika Mandanna: ఇందులో నిజమెంత..?

Twitter IconWatsapp IconFacebook Icon
Rashmika Mandanna: ఇందులో నిజమెంత..?

స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళుతున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు తన రెమ్యునరేషన్ పెంచిందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన రష్మిక మందన్న మొదటి సినిమాతో హిట్ అందుకొని తెలుగులో దర్శకనిర్మాతల, హీరోల దృష్టిని ఆకర్శించింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి చిత్రాలు రష్మికకి స్టార్ స్టేటస్‌ని తెచ్చి పెట్టాయి.

దాంతో ఇటు సౌత్ భాషలలో అటు హిందీలో అవకాశాలు అందుకుంటోంది. అయితే, రష్మిక మందన్నకి ‘పుష్ప’ సినిమాకు ముందు 1 కోటి వరకూ రెమ్యూనేషన్ అందుకుందని ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజీ హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తాజాగా ‘సీతారామం’ (Sita Ramam) సినిమాలో ఆఫ్రీన్ అనే ప్రత్యేక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 

‘సీతారామం’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దాంతో ఇప్పుడు తాను కొత్తగా సైన్ చేయాలనుకున్న తెలుగు చిత్రాలకు 3 కోట్లు..హిందీ సినిమా అయితే 4 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఒకవైపు సినిమా మేకింగ్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్టార్‌ హీరోలు కూడా తమ రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటామని ఇటీవల కొందరు ముందుకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రష్మిక రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.