Rashmika Mandanna: సిగ్గుపడుతూ ఫ్యాన్ గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన బ్యూటీ.. అతని రియాక్షన్ చూసి..

ABN , First Publish Date - 2022-09-27T19:32:13+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో(Chalo)’ సినిమాతో..

Rashmika Mandanna: సిగ్గుపడుతూ ఫ్యాన్ గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన బ్యూటీ.. అతని రియాక్షన్ చూసి..

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో(Chalo)’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం వరుసగా స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాకుండా.. గతేడాది వచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప(Pushpa)’తో ఈ భామకి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ముంబైతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడికి వెళ్లిన ఈ తారని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కొందరైతే ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ (autograph) తీసుకునేందుకు తహతహలాడుతున్నారు.


తాజాగా అలాంటి ఘటనే రష్మికకి ఎదురైంది. ఆమె ముంబైలోని ఓ హోటల్‌కి వెళ్లి వస్తుండగా.. ఆమెని ఆటోగ్రాఫ్ చేయమని ఓ ఫ్యాన్ రిక్వెస్ట్ చేశాడు. అది కూడా అతని గుండెల మీద. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. రష్మిక హోటల్ బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఈ బ్యూటీ దగ్గరకి ఓ ఫ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ తారని ఆటోగ్రాఫ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. దాంతో.. రష్మిక ఓకే అనగానే అతను తన షర్ట్‌ని పక్కకి జరిపి తన గుండెల మీద చేయమని రిక్వెస్ట్‌గా అడిగాడు. దాంతో రష్మిక కొంచెం ఇబ్బందిగానే ఆ అతని హార్ట్ మీద సిగ్గు పడుతూ మరి ఆటోగ్రాఫ్ చేసింది. అనంతరం ఆ ఫ్యాన్ ఈ బ్యూటీ చేతులు పట్టుకుని ధన్యవాదాలు చెప్పాడు.


ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా మంచి వ్యక్తని’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ ఫ్యాన్‌ని అదృష్టవంతుడు, చాలా ఆనందరపడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’లో నటిస్తోంది. అలాగే.. అమితాబ్ బచ్చన్‌తో ‘థ్యాంక్యూ’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేస్తూ బాలీవుడ్‌(Bollywood)లో బిజీ హీరోయిన్‌గా మారింది.



Updated Date - 2022-09-27T19:32:13+05:30 IST