పారితోషికంతో పనేముంది?

ABN , First Publish Date - 2022-08-13T06:28:28+05:30 IST

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. మార్కెట్‌, బడ్జెట్‌.. వీటికి రెక్కలొచ్చాయి. పారితోషికాలకు కూడా. ఇది వరకటితో పోలిస్తే...

పారితోషికంతో పనేముంది?

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. మార్కెట్‌, బడ్జెట్‌.. వీటికి రెక్కలొచ్చాయి. పారితోషికాలకు కూడా. ఇది వరకటితో పోలిస్తే... రెమ్యునరేషన్లు మూడు నాలుగు రెట్లు పెరిగాయి. కథానాయికలు కూడా పోటీ పడి పారితోషికాలు పెంచేస్తున్నారు. పాన్‌ ఇండియా ట్యాగ్‌ లైన్‌ వచ్చాక వాళ్ల డిమాండ్‌ మరింతగా ఉంది. ‘మరి మీరు కూడా మీ పారితోషికం పెంచేశారా’ అని రాశీఖన్నాని అడిగితే... ‘‘అందరూ ఇదే మాట అడుగుతుంటారు. అయినా పారితోషికంతో పనేంటి? ఎవరికి ఎంత ఇవ్వాలి? ఎవరి దగర్నుంచి ఎంత తీసుకోవాలి? అనేది పూర్తిగా ఓ నిర్మాతకీ, నటికీ మధ్య జరిగే వ్యవహారం. కొన్ని సినిమాలకు మేం పారితోషికం డిమాండ్‌ చేస్తాం. ఇంకొన్ని సినిమాలకు ఎంత ఇస్తే.. అంతకు చేస్తాం. కొన్నిసార్లు పాత్రలు నన్ను ప్రేరేపిస్తుంటాయి. స్ఫూర్తి నింపుతుంటాయి. అలాంటి కథలు వచ్చినప్పుడు నేనే కాదు.. ఎవరూ పారితోషికం గురించి పట్టించుకోరు. ఓ సినిమాకి ఫ్రీగా పనిచేయొచ్చు. ఆ సినిమా వల్ల మరో నాలుగు అవకాశాలు రావొచ్చు. అలాంటప్పుడు... తీసుకొన్నది ఎంత అనేది ఎప్పటికీ లెక్క కాదు’’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. 

Updated Date - 2022-08-13T06:28:28+05:30 IST