రారా రాక్కమ్మా...

ABN , First Publish Date - 2022-05-26T06:40:15+05:30 IST

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. జులై 28న విడుదలవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా...

రారా రాక్కమ్మా...

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. జులై 28న విడుదలవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా...’ అంటూ సాగే మాస్‌ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఈ చిత్రంలో గదాంగ్‌ రాక్కమ్మ పాత్రలో నటిస్తున్నారు. మంగ్లీ, నకాష్‌ అజీజ్‌ పాడిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా జాక్వెలిన్‌ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్‌ సాంగ్‌. చిత్రీకరణ సమయంలో ఎంజాయ్‌ చేస్తూ చేశాను. ఈ సాంగ్‌లో హుక్‌స్టెప్‌ను ఒకసారి ట్రై చేయాలనుకుంటార’ని అన్నారు. ఈ చిత్రానికి అనూప్‌ భండారి దర్శకుడు. జాక్‌ మంజునాథ్‌, శాలిని మంజునాథ్‌ నిర్మాతలు. 


Updated Date - 2022-05-26T06:40:15+05:30 IST