ఒక్క పాటతో... వందల ఆత్మహత్యల్ని... అడ్డుకున్న గాయకుడు!

ABN , First Publish Date - 2021-12-16T16:51:48+05:30 IST

ఏ గాయకుడైనా తన పాటతో వందలాది మందిని అలరిస్తాడు. అది ఎప్పుడూ జరిగేదే. కానీ, ఓ సింగర్ ఎవరూ ఊహించని గొప్ప పని చేశాడు! చివరకు, అసలు తన పాట అలాంటి ప్రభావం చూపుతుందని ఆయన కూడా అనుకుని ఉండడు! కానీ, ఒక్క పాట... ఒకే ఒక్క పాట... వందలాది మంది ప్రాణాలు కాపాడింది. వేలాది మంది జీవితాల్లో ఆప్తుల్ని కోల్పోయిన విషాదం పొడచూపకుండా చేయగలిగింది!

ఒక్క పాటతో... వందల ఆత్మహత్యల్ని... అడ్డుకున్న గాయకుడు!

గాయకుడైనా తన పాటతో వందలాది మందిని అలరిస్తాడు. అది ఎప్పుడూ జరిగేదే. కానీ, అమెరికాలో ఓ సింగర్ ఎవరూ ఊహించని గొప్ప పని చేశాడు! చివరకు, అసలు తన పాట అలాంటి ప్రభావం చూపుతుందని ఆయన కూడా అనుకుని ఉండడు! కానీ, ఒక్క పాట... ఒకే ఒక్క పాట... వందలాది మంది ప్రాణాలు కాపాడింది. వేలాది మంది జీవితాల్లో ఆప్తుల్ని కోల్పోయిన విషాదం పొడచూపకుండా చేయగలిగింది!


అమెరికాలో ‘లాజిక్’ అనే సింగర్‌కి ర్యాపర్‌గా మంచి పేరుంది. లాజిక్ అన్న పేరు ఎంత ఎక్స్‌ట్రాడినరీగా ఉందో... అంతే విశేషంగా ఆయన 2017 నాటి పాట నిశ్శబ్ధంగా తన ప్రభావం చూపింది! లాజిక్ అప్పట్లో '1-800-273-8255' అన్న పాట పాడాడు. అదేం వింత పాట అనిపిస్తోంది కదూ? చాలా వెరైటీగా సాగే తన పాటలో ‘యూఎస్ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్‌లైన్’ నంబర్‌ని ఆయన గొంతెత్తి నినదించాడు. అదే... తాజాగా జరిపిన ఓ అధ్యాయనంలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూడటానికి కారణమైంది!


2017 ఏప్రెల్‌లో లాజిక్ తన '1-800-273-8255' సాంగ్‌ని రిలీజ్ చేశాడు. అందులోని స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఆత్మహత్యలు నివారించే జాతీయ ప్రభుత్వ సంస్థది కావటంతో క్రమంగా అధికారులకి కాల్స్ రావటం ఎక్కువైందట. ఒక స్టడీ ప్రకారం 2017-2018 మధ్య కాలంలో 10 వేల కాల్స్ అధికంగా వచ్చాయట. అంతే కాదు, అదే సమయంలో 10 ఏళ్ల నుంచీ 19 ఏళ్ల మధ్య వయస్సుగల వారిలో 5.5 శాతం మేర ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని కూడా అధ్యయనంలో తేలింది! అమెరికా వ్యాప్తంగా 5.5 శాతం అంటే... వందలాది మంది సూసైడ్ చేసుకోవాలని భావించిన వారు తమ ఆలోచన విరమించినట్టే! ఈ శుభ పరిణామానికి కారణం ర్యాపర్ లాజిక్ పాడిన '1-800-273-8255' సాంగే అంటున్నారు స్టడీ కండక్ట్ చేసిన అధ్యయనకారులు...   

Updated Date - 2021-12-16T16:51:48+05:30 IST