స్టేజీ వెనకాలే గాయకుడికి కత్తిపోట్లు... లైవ్ షోలో తీవ్ర విషాదం...

ABN , First Publish Date - 2021-12-21T00:54:04+05:30 IST

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో ఓ సంగీతా విభావరి సందర్భంగా 28 ఏళ్ల యువ గాయకుడు మృతి చెందాడు. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్‌’గా ఫేమస్ అయిన టాలెంటెడ్ సింగర్ కత్తి పోట్లకు గురికావటంతో అకాల మరణం పాలయ్యాడు...

స్టేజీ వెనకాలే గాయకుడికి కత్తిపోట్లు... లైవ్ షోలో తీవ్ర విషాదం...

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో ఓ సంగీతా విభావరి సందర్భంగా 28 ఏళ్ల యువ గాయకుడు మృతి చెందాడు. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్‌’గా ఫేమస్ అయిన టాలెంటెడ్ సింగర్ కత్తి పోట్లకు గురికావటంతో అకాల మరణం పాలయ్యాడు. ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ఎల్‌ఏ’ అనే కాన్సర్ట్ జరగాల్సి ఉండగా డ్రాకియో అదే ఈవెంట్ తాలూకూ మెయిన్ స్టేజ్ వెనకాల హత్యకు గురయ్యాడు. 


లాస్ ఏంజిలిస్ నగరంలో పెద్ద ఎత్తున జరగాల్సి ఉన్న ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం..’ లైవ్ షోకు భారీ ఏర్పాట్లు చేశారు. డ్రాకియోతో పాటూ స్నూప్ డాగ్, 50 సెంట్ వంటి ప్రముఖ అమెరికన్ ర్యాపర్స్ కూడా పర్ఫామ్ చేయాల్సి ఉంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా 28 ఏళ్ల డ్రాకియోను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయటంతో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడ్ని హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించినప్పటికీ డాక్టర్లు ప్రాణాలు కాపాడలేకపోయారని అమెరికన్ మీడియా చెబుతోంది... 

Updated Date - 2021-12-21T00:54:04+05:30 IST