ఆ హీరో లాగానే ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేస్తానంటున్న Ranveer Singh

ABN , First Publish Date - 2021-10-08T02:11:43+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. బ్యాండ్ బాజా బరాత్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అనంతరం లేడీస్ వర్సెస్ రికీ బహల్, లూటేరా, గుండే, రామ్‌లీలా తదితర చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలీకి పేవరేట్ నటుడాయన.

ఆ హీరో లాగానే ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేస్తానంటున్న Ranveer Singh

సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు రణ్‌వీర్ సింగ్. బ్యాండ్ బాజా బరాత్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అనంతరం లేడీస్ వర్సెస్ రికీ బహల్, లూటేరా, గుండే, రామ్‌లీలా తదితర చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలీకి పేవరేట్ నటుడాయన.  బన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాల్లో కనిపించాడు. 


బాలీవుడ్ నటులందరూ బుల్లితెరపై ఎన్నాళ్ల నుంచో సందడి చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, శిల్పాశెట్టి, సల్మాన్ ఖాన్ తదితర నటులెందరో టీవీ తెరపై కనిపించారు. తాజాగా ఆ జాబితాలోకి మరొక నటుడు చేరనున్నాడు. రణ్ వీర్ సింగ్  ‘‘బిగ్ పిక్చర్’’ అనే టీవీ షోను హోస్ట్ చేయబోతున్నాడు. సల్మాన్ ఖాన్ ఈ షోకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ షో ప్రమోషన్‌లో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.


వ్యక్తిగతంగా మీకు బిగ్ పిక్చర్ ఏంటి విలేకర్లు ప్రశ్నించారు. అందుకు అయన సమాధానం ఇస్తూ..‘‘ నాకు ఒక అందమైన ఇల్లు కావాలి. అందులో కుటుంబంతో సహా నా భార్య, పిల్లలు ఉంటాము. పిల్లలు ఆడుకునేందుకు ఇంటి చుట్టు ఖాళీ స్థలం ఉండాలి. ఇంత కంటే ఏం కావాలి. ఇదే నా జీవితంలో బిగ్ పిక్చర్ ’’ అని సమాధానమిచ్చాడు. ఒక వేళ షో కనుక విజయం సాధిస్తే సల్మాన్ ఖాన్ లాగానే  నవీ ముంబయిలోని పన్వేల్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేస్తానన్నారు.


రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే అలీబాగ్‌లో రూ.22కోట్ల విలువ చేసే ఒక అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ, రాహుల్ ఖన్నా తదితరులకు కూడా ఇక్కడే ఇళ్లున్నాయి. ప్రస్తుతం అతడు నటించిన అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నయి. ‘‘83’’ మూవీ ఈ ఏడాది డిసెంబరులో క్రిస్ మస్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయన కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది.  


Updated Date - 2021-10-08T02:11:43+05:30 IST