Jayeshbhai Jordaar : రణవీర్ సింగ్ తండ్రి కాబోతున్నాడా?

ABN , First Publish Date - 2022-04-18T20:59:30+05:30 IST

చేతిలో ఓ గర్భస్థ శిశువు తాలూకూ బొమ్మని పట్టుకుని రణవీర్ సింగ్ కెమెరాకు ఫోజిచ్చాడు. అంటే... రణవీర్, దీపికా త్వరలో మనకేదైనా గుడ్ న్యూస్ అఫీషియల్ గా చెప్పబోతున్నారా? అదే నిజమైతే అభిమానులకి పండగే!

Jayeshbhai Jordaar : రణవీర్ సింగ్ తండ్రి కాబోతున్నాడా?

చేతిలో ఓ గర్భస్థ శిశువు తాలూకూ బొమ్మని పట్టుకుని రణవీర్ సింగ్ కెమెరాకు ఫోజిచ్చాడు. అంటే... రణవీర్, దీపికా త్వరలో మనకేదైనా గుడ్ న్యూస్ అఫీషియల్ గా చెప్పబోతున్నారా? అదే నిజమైతే అభిమానులకి పండగే! కానీ, అలాంటిదేం లేకపోవటమే కొసమెరుపు! రణవీర్ సింగ్ తన తాజా చిత్రం ‘జయేశ్ భాయ్ జోర్దార్’కు సంబంధించిన సరికొత్త పోస్టర్ నెటిజన్స్ తో షేర్ చేశాడు. అందులో వెరైటీ లుక్ తో ఆకట్టుకున్నాడు... 


యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రణవీర్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ‘జయేశ్ భాయ్ జోర్దార్’. ఈ సినిమాతో మన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ శాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మే 13న విడుదలకు సిద్ధమవుతోన్న ‘జయేశ్ భాయ్’ ఏప్రెల్ 19న టీజర్ తో అలరించబోతున్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేసేందుకే రణవీర్ సింగ్ సరికొత్త గెటప్ తో చేతిలో శిశువుని పట్టుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు. పైగా పోస్టర్ పై ‘పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా?’ అంటూ ప్రశ్న కూడా సంధించాడు. ‘జయేశ్ భాయ్ జోర్దార్’ కథ ఏంటో ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ... గతంలో ఓ వీడియోలో రణవీర్ సినిమా గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాడు. గతంలో మీరూ ఎప్పుడూ చూడని హీరోని చూడబోతున్నారు... అతనే జయేశ్ భాయ్ అంటూ చెప్పుకొచ్చాడు!


పెళ్లి తరువాత దీపికతో కలసి రణవీర్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడా అని వారిద్దరి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు! దీపిక ఇప్పుడప్పుడే తల్లి అయ్యే ఆలోచనలో ఉన్నట్లయితే కనిపించటం లేదు. మరి సినిమాలో రణవీర్ తండ్రి అవుతాడా? కాడా? అయితే, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ‘జయేశ్ భాయ్ జోర్దార్’ విడుదల వరకూ మనం ఓపిగ్గా ఆగాల్సిందే...  

Updated Date - 2022-04-18T20:59:30+05:30 IST