RRR, పుష్ప సినిమాలపై రణ్‌వీర్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. విస్మయం చెందానంటూ..

ABN , First Publish Date - 2022-05-11T17:45:10+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. వరుసగా మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ..

RRR, పుష్ప సినిమాలపై రణ్‌వీర్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. విస్మయం చెందానంటూ..

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. వరుసగా మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా పాన్ ఇండియా సినిమా, నేషనల్ లాంగ్వేజ్ మీద వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. కన్నడ నటుడు సుదీప్ ఓ సందర్భంలో హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని కామెంట్స్ చేశాడు. దీనిపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కొంచెం ఘాటుగా స్పందించడంతో వివాదం చెలరేగింది. దీనిపై మరికొందరు సెలబ్రిటీలు సైతం స్పందించారు. మే 13న విడుదలకానున్న రణ్‌వీర్ సింగ్ తాజా చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్పందించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.


రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను ఆర్టిస్ట్‌ని, వ్యాపారిని లేదా నిర్మాతను కాదు. కాబట్టి సినిమా వ్యాపారం గురించి నాకు అంతగా తెలియదు. సరిగ్గా చెప్పాలంటే అంత అవగాహన లేదు. నేను పెయిడ్ ప్రొఫెషనల్‌ని, డబ్బు తీసుకొని కెమెరా ముందు నా కళను ప్రదర్శిస్తుంటాను. నా జ్ఞానం అంతవరకే పరిమితం. కానీ.. వ్యక్తిగతంగా మాత్రం హిందీలో డబ్ అయ్యి, పాన్ ఇండియా చిత్రాలుగా చెలామణి అవుతున్న మూవీస్ మంచి సినిమాలు అని చెప్పగలను.


నాకు తెలుగు రాదు.. కానీ నేను ‘పుష్ప’ని చూశాను. ‘RRR’ని చూశాను. వాటి కాన్సెప్ట్, అందులోని క్రాఫ్ట్ స్టైల్ నన్ను విస్మయానికి గురిచేసింది. వాటి నాణ్యతని చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అలాంటి అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు అంగీకరించేలా చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలని నేనెప్పుడు పరాయి వాళ్లకి సంబంధించినవిగా చూడను. అవన్నీ మా సినిమాలే. అన్నీ భారతీయ సినిమాలే’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-11T17:45:10+05:30 IST