ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా Ranveer Singh ఫొటోలు.. ఇదేం పనంటూ నెట్టింట ట్రోల్స్ రావడంతో..

ABN , First Publish Date - 2022-07-22T14:55:23+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబో చిత్రం ‘లైగర్’ మూవీ పోస్టర్‌ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో..

ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా Ranveer Singh ఫొటోలు.. ఇదేం పనంటూ నెట్టింట ట్రోల్స్ రావడంతో..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబో చిత్రం ‘లైగర్’ మూవీ పోస్టర్‌ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ దాదాపు బట్టలు లేకుండా ఉన్నాడు. కేవలం పూలగుత్తి మాత్రమే అడ్డుగా ఉంటుంది. అలాగే.. బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా సైతం విజయ్‌ని అనుకరిస్తూ కేవలం దిండు అడ్డుపెట్టుకొని ఓ పిక్‌ని సోషల్ మీడియాలో విడుదల చేశాడు. అది సైతం నెట్టింట హల్‌చల్ చేసింది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) సైతం న్యూడ్ పిక్‌‌ని పోస్ట్ చేయగా అది సైతం వైరల్‌గా మారింది.


బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. ఈ నటుడు నటనకే కాకుండా విచిత్రమైన డ్రెస్సింగ్‌తోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాడు. అయితే.. తాజాగా ఈ నటుడి న్యూడ్ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ ఈ పిక్స్ దిగాడు. వైరల్ పిక్స్‌ (Viral Pics)పై పలువురు నెటిజన్లు స్సందించారు. కొందరు నటుడిని హాట్ అని పిలుస్తుండగా.. మరికొందరు ఆయన పూర్తి నగ్నంగా ఉండడంపై విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ‘ఇదేం పని’, ‘బాలీవుడ్‌ని వదిలేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు.


దీంతో ఈ పిక్స్‌‌పై రణ్‌వీర్ స్పందిస్తూ.. ‘పబ్లిక్‌గా నగ్న ఫొటోలకి స్టిల్స్ ఇవ్వడం నాకు కష్టంకాదు. అందుకే కొన్ని ప్రదర్శనలలో నేను నగ్నంగా చేయగలిగాను. అందులో మీరు నా ఆత్మను చూడొచ్చు. నేను వేలమంది ముందు నగ్నంగా ఉండగలను. కానీ.. జనాలు అసౌకర్యానికి గురయితే నేనేం చేయలేను’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. రణ్‌వీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్‌ (Cirkus)’ అనే మూవీని చేస్తున్నాడు. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. అలాగే అలియా భట్‌తో కలిసి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే మూవీలో నటిస్తున్నాడు.



Updated Date - 2022-07-22T14:55:23+05:30 IST