అందరూ చూస్తుండగానే అభిమానుల ప్యాంట్లను విప్పేయించిన Ranveer Singh.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-24T21:22:45+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. మొదటి సినిమా నుంచి డిఫరెంట్ కథలను..

అందరూ చూస్తుండగానే అభిమానుల ప్యాంట్లను విప్పేయించిన Ranveer Singh.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ఒకరు. మొదటి సినిమా నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ నటుడు సినీరంగంలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. నటనతోనే కాకుండా డిఫరెంట్ డ్రెస్సింగ్‌, డేరింగ్ వైఖరితోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే ఆయన ఏం చెప్పినా చేయడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఓసారైతే రణ్‌వీర్ తన అభిమానుల్లో మగవారిని పబ్లిక్‌గా ప్యాంటు విప్పమని సవాలు విసిరాడు. దీంతో ఏమాత్రం ఆలోచించని ఫ్యాన్స్ నటుడు చెప్పినట్లే చేశారు. అసలేం జరిగిందంటే..


రణ్‌వీర్ సింగ్ 2016లో ఓ టెక్స్టైల్ స్టోర్‌ని ప్రారంభించాడు. ఆ స్టోర్ ప్రమోషనల్ ఈవెంట్‌‌‌తో భాగంగా ‘డోంట్ హోల్డ్ బ్యాక్’ థీమ్‌తో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అక్కడికి వచ్చిన అభిమానులకు కొన్ని పంపిణీ చేయాలనుకున్నారు. అందులో భాగంగా రణ్‌వీర్ కొందరు అభిమానులను ఎంచుకొని వారిని ‘డేర్ టు బేర్ (Dare To Bare) ’ అంటూ అందరి ముందు ప్యాంటు విప్పమని కోరాడు. దీంతో ఆయన అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా ఆ నటుడు చెప్పినట్లే వాటిని తీసి ఓ డబ్బాలో పడేశారు. అనంతరం వారందరికీ స్టోర్స్‌లోని కొత్త జీన్స్‌ని బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా రణ్‌వీర్ అభిమానులను ఉత్తేజపరుస్తూ రాప్ చేయడంతోపాటు డ్యాన్స్ కూడా వేశాడు.

Updated Date - 2022-05-24T21:22:45+05:30 IST