‘ 83’ కి భారీ పారితోషికం.. లాభాల్లో వాటా తీసుకుంటున్న Ranveer Singh

ABN , First Publish Date - 2021-12-22T23:26:31+05:30 IST

బాలీవుడ్‌లో విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రణ్ వీర్ సింగ్. అతడు హీరోగా తెరకెక్కిన సినిమా ‘

‘ 83’ కి భారీ పారితోషికం.. లాభాల్లో వాటా తీసుకుంటున్న  Ranveer Singh

బాలీవుడ్‌లో విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రణ్ వీర్ సింగ్. అతడు హీరోగా తెరకెక్కిన సినిమా ‘83’. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ 1983లో క్రికెట్ వరల్డ్ కప్‌‌‌ను గెలుచుకుంది. వరల్డ్ కప్ నేపథ్యం ఆధారంగా ‘ 83 ’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించాడు. ఈ సినిమాలో నటించినందుకు రణ్ వీర్ సింగ్‌‌కు భారీ పోరితోషికం అందినట్టు తెలుస్తోంది. సినిమా లాభాల్లోను వాటా తీసుకొబోతున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


‘‘ రణ్ వీర్ సింగ్ వరుసగా బాక్సాఫీస్ వద్ద వరుసగా హిట్లు కొడుతున్నాడు. అతడికి పెద్ద మొత్తంలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాకు అతడు రూ. 20కోట్లు ఛార్జ్ చేశాడు. సినిమాకు వచ్చే లాభాల్లో కూడా షేర్ ఇవ్వాలని నిర్మాతలను కోరాడు. ఎంత మొత్తంలో షేర్ తీసుకుంటాడనేది తెలియడం లేదు. సినిమా విడుదల అనంతరం ఆ మొత్తం  ఎంత అనేది తెలుస్తోంది ’’ చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు. 


‘83’ సినిమాను రిలయన్స్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, దీపికా పడుకొణె, పంకజ్ త్రిపాఠీ, తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీం, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, డింకర్ శర్మ, నిషాంత్ దహియా, హార్డీ సంధూ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2021-12-22T23:26:31+05:30 IST