Rangamarthanda : విడుదలయ్యేది అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-06-27T15:47:23+05:30 IST

యేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamshi).. గత చిత్రం ‘నక్షత్రం’ (Nakshtram) ఘోర పరాజయం పాలైంది. దాదాపుగా ఐదేళ్ళ నుంచి ఆయన నుంచి మరో సినిమా రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కృష్ణవంశీ ఒకే సినిమాపై తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Rangamarthanda : విడుదలయ్యేది అప్పుడేనా?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamshi).. గత చిత్రం ‘నక్షత్రం’ (Nakshtram) ఘోర పరాజయం పాలైంది. దాదాపుగా ఐదేళ్ళ నుంచి ఆయన నుంచి మరో సినిమా రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కృష్ణవంశీ ఒకే సినిమాపై తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే ‘రంగమార్తాండ’ (Rangamarthanda). మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘నటసమ్రాట్’ (Natasamrat) చిత్రానికిది అఫీషియల్ రీమేక్. నానా పాటేకర్ (Nana Patekar) ప్రధాన పాత్రపోషించగా.. ఆ పాత్రను తెలుగు వెర్షన్‌లో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) చేస్తున్నారు.  బ్రహ్మానందం (Brahmanandam) తన కెరీర్ లోనే చేయని ఒక ఎమోషనల్ కేరక్టర్‌కు జీవం పోస్టున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకా రమ్యకృష్ణ (Ramyakrishna), శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


చాలా కాలంగా సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకి బడ్జెట్ పరంగా సమస్యలు ఎదురయ్యాయి. ఓ పది శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా.. నిర్మాత దగ్గర డబ్బులు లేకపోవడంతో సినిమా ఆగిపోయింది.  అయితే ఓటీటీ (OTT) లో చిత్రానికి మంచి ఆఫర్ రావడం.. సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలకై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ‘రంగమార్తాండ’ చిత్రానికి మోక్షం లభించింది. నిర్మాత డబ్బులు సర్దుబాటు చేయడంతో బ్యాలెన్స్ పార్ట్‌ను పదిరోజుల్లో పూర్తి చేయబోతున్నారట. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటీటీలో మంచి ఆఫర్ వచ్చినప్పటికీ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలని కృష్ణ వంశీ ఆలోచనగా తెలుస్తోంది. చివరిలో నిర్ణయం మారితే తప్ప.. చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ ఖాయం అని టాక్.


చాలా కాలంగా కృష్ణ వంశీ  తన మార్క్ సినిమాను అందివ్వడంలో విఫలమవుతున్నారు. ఆయన నుంచి సరైన చిత్రం వచ్చి చాలా కాలమైపోయింది. ఈ నేపథ్యంలో ‘రంగమార్తాండ’ (Rangamarthanda) చిత్రం తిరిగి ఆయన్ను ఇండస్ట్రీలో దర్శకుడిగా నిలబెడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా కృష్ణవంశీకి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-27T15:47:23+05:30 IST