Ranga Ranga Vaibhavanga ట్రైలర్: కలర్ ఫుల్ ట్రీట్

ABN , First Publish Date - 2022-08-24T00:44:25+05:30 IST

‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు. బి స‌మ‌ర్ప‌ణ‌లో గిరీశాయ

Ranga Ranga Vaibhavanga ట్రైలర్: కలర్ ఫుల్ ట్రీట్

‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) నటించిన తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు. బి స‌మ‌ర్ప‌ణ‌లో గిరీశాయ (Gireeshaaya) ద‌ర్శ‌కత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2వ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం విడుదల చేసింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుందనేది.. ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 


ట్రైలర్ విషయానికి వస్తే.. చిన్నప్పుడే హీరోహీరోయిన్లు ఒకరినొకరు చెంప చెల్లుమనేలా కొట్టుకునే సీన్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. నువ్వు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడనని హీరోయిన్.. నువ్వు వచ్చి నాతో మాట్లాడినా, నేను నీతో మాట్లాడను అని హీరో.. ఇలా చిన్నప్పుడు చేసుకున్న శపథంని.. పెద్దయ్యే వరకు కూడా కంటిన్యూ అయినట్లుగా సరదా సన్నివేశాలతో చూపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య టీజింగ్ సన్నివేశాలతో పాటు, ఒక్కసారిగా ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టినట్లుగా చూపిస్తూ.. ట్రైలర్‌ని కలర్‌ఫుల్‌గా నడిపించారు. అనంతరం సీరియస్ మోడ్‌లోకి ట్రైలర్‌ని టర్న్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు, హీరో జైలులో ఉండటం వంటి పలు ఆసక్తికర సన్నివేశాలను చూపించి.. చివరికి ‘నాన్నా.. ఇప్పటి వరకు  ఒక లెక్క.. ఇప్పటి నుండి ఇంకో లెక్క. చెప్పను.. చూపిస్తా.. హా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ని ముగించారు. ‘నువ్వే కావాలి’.. ‘నువ్వు లేక నేను లేను’ స్టోరీ లైన్‌లో ఈ సినిమా నడుస్తూ.. చివరికి ఓ ట్విస్ట్‌తో ముగుస్తుందనేది.. ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. నిర్మాణ విలువలు, కెమెరా, మ్యూజిక్ హైలెట్ అనేలా ఉన్నాయి. ఓవరాల్‌గా.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిందనే విషయాన్ని తెలియజేయడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. (Ranga Ranga Vaibhavanga Trailer)



Updated Date - 2022-08-24T00:44:25+05:30 IST