The Kashmir Files తరువాత మరో వివాదాస్పద చిత్రానికి రంగం సిద్ధం! టైటిల్ రోల్‌లో ఎవరంటే...

ABN , First Publish Date - 2022-03-24T04:12:59+05:30 IST

ప్రస్తుతం దేశంలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు ‘ద కాశ్మీర్ ఫైల్స్’. కాశ్మీరు నుంచీ కన్యాకుమారి దాకా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్ సినిమా. అయితే, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఎంత విజయవంతమైందో అంతే వివాదాస్పదం కూడా అయింది. తాజాగా మరో చారిత్రక, వివాదాస్పద బయోపిక్ బాలీవుడ్‌లో సిద్ధమవుతోంది...

The Kashmir Files తరువాత మరో వివాదాస్పద చిత్రానికి రంగం సిద్ధం! టైటిల్ రోల్‌లో ఎవరంటే...

ప్రస్తుతం దేశంలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు ‘ద కాశ్మీర్ ఫైల్స్’. కాశ్మీరు నుంచీ కన్యాకుమారి దాకా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్ సినిమా. అయితే, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఎంత విజయవంతమైందో అంతే వివాదాస్పదం కూడా అయింది. తాజాగా మరో చారిత్రక, వివాదాస్పద బయోపిక్ బాలీవుడ్‌లో సిద్ధమవుతోంది. ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ ఇప్పటికే జనం ముందుకొచ్చాయి. లెటెస్ట్‌గా బాలీవుడ్ బిగ్ స్క్రీన్‌పై వీర్ సావర్కర్‌గా కనిపించబోయే నటుడు ఎవరో కూడా తేలిపోయింది...


బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్లో వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా ఒకరు. అయితే, ‘హిందూత్వ’ అన్న పదం వాడుకలోకి తెచ్చిన ఆయన గురించి గాంధీ, నెహ్రుల మాదిరిగా ప్రచారం జరగలేదు. సావర్కర్ గురించిన ప్రస్తావన మన పాఠ్యపుస్తకాల్లో కూడా తక్కువే. ఇక సినిమా రూపంలో సావర్కర్ జీవిత చరిత్ర, ఆయన పోరాటం కూడా పెద్దగా జనంలోకి వెళ్లలేదు. కానీ, ప్రస్తుతం మరాఠీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ బయోపిక్‌కి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు టైటిల్ రోల్‌లో బీ-టౌన్ టాలెంటెడ్ యాక్టర్ రణదీప్ హూడా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా రణదీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 


‘‘కొన్ని కథలు చెప్పబడతాయి... కొన్ని జీవింపబడతాయి...’’ అంటూ రణదీప్ హూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించాడు. సావర్కర్ పాత్రలో తాను వెండితెరపై జీవింపబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. అయితే, ఎటొచ్చీ ‘ద కాశ్మీర్ ఫైల్స్’తో పెద్ద దుమారమే రేగింది దేశంలో. మరి స్వతంత్ర సంగ్రామ యోధుడిగానే కాక హిందూత్వ నాయకుడిగా పేరున్న వివాదాస్పద వీర్ సావర్కర్ బాక్సాఫీస్ వద్ద ఏం చేస్తారో వేచి చూడాలి! రణదీప్ హూడా టైటిల్ రోల్‌లో మహేశ్ మంజ్రేకర్ తన ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ మూవీతో ఇంకెలాంటి చారిత్రక తేనెతుట్టెల్ని కదిపి, కుదుపుతాడో... 

Updated Date - 2022-03-24T04:12:59+05:30 IST