బాలీవుడ్లో క్రేజీ కపుల్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఖచ్చితంగా ఉంటుంది. 2017 నుంచి ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒకటయ్యారు. ఇటీవలే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలియానే స్వయంగా సోషల్ మీడియాలో ఆమె ఆసుపత్రిలో చెక్ చేయించుకుంటున్న పిక్‌ని షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. ఆ పిక్‌లో రణ్‌బీర్ సైతం ఉన్నాడు. అయితే.. ఆయన వెనుక భాగం మాత్రమే అందులో కనిపిస్తోంది.
ఆలియా ఆ పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి ఈ జంట ఎక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అదే విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. విషెస్ చెబుతున్నారు. రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘షంషేరా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమం ముంబైలోని ఓ హోటల్లో జరిగింది. ఆ సందర్భంలో ఆయన సోషల్ మీడియా రిపోర్టర్ల కంటపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అందులో.. రిపోర్టర్లు మీరు తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. అది విన్న రణ్‌బీర్ నువ్వు బాబాయ్.. నువ్వు మామా అయ్యావు.. అంటూ ఫన్నీగా రిపోర్టర్లకి చెబుతూ క్యారవాన్‌లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో రణ్వీర్ సింగ్(Ranveer Singh) బర్త్ డే కాబట్టి ఏదైనా చెప్పమని కోరారు. దీంతో రణ్‌బీర్.. ‘సూపర్ గాయ్. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ’ అంటూ రణ్వీర్ సింగ్‌కి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ వైరల్ వీడియోపై ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘చాలా క్యూట్’, ‘నీ విషెస్‌ని రణ్వీర్ ఎంజాయ్ చేస్తాడు’, ‘సూపర్‌గా మాట్లాడావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.