Shamshera: ఆ సినిమాలో Allu Arjun పాత్ర చేయాలని ఉందంటున్న Ranbir Kapoor.. SS Rajamouli తో కలిసి..

ABN , First Publish Date - 2022-07-14T21:40:21+05:30 IST

బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor) ఒకరు...

Shamshera: ఆ సినిమాలో Allu Arjun పాత్ర చేయాలని ఉందంటున్న Ranbir Kapoor.. SS Rajamouli తో కలిసి..

బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor) ఒకరు. ముఖ్యంగా ఈ యువ నటుడికి లేడీ అభిమానులు ఎక్కువ. అందుకే ఈ హీరోని చాక్లెట్ బోయ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. 2018లో సంజయ్ దత్ జయోపిక్‌గా వచ్చిన ‘సంజు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ నటుడు.. దాదాపు నాలుగేళ్ల తర్వాత చేస్తున్న మూవీ ‘షంషేరా (Shamshera)’. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వాణీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.


ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. రణ్‌బీర్ ఈ చిత్రంలో షంషేరా, బల్లి అనే పాత్రల్లో తండ్రికొడుకులుగా నటిస్తున్నాడు. ఈ యంగ్ హీరో కెరీర్‌లోనే మొట్టమొదటిసారి ఊరా మాస్ క్యారెక్టర్‌తోపాటు డబుల్ రోల్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 22న విడుదల కానుంది. హిందీతోపాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళంలోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ స్సెషల్ ఇంటర్వ్యూని మూవీటీం విడుదల చేసింది. అందులో.. యాంకర్ కనిపించకుండా అడిగిన పలు ప్రశ్నలకు రణ్‌బీర్ ఆసక్తికర సమాధానాలు తెలిపాడు.


అందులో.. ‘మీరు ఎవరితో కలిసి రోడ్ ట్రిప్ చేయడానికి ఇష్టపడతారు?’ అని అడగగా.. ‘అనుష్క శర్మ, ఆదిత్యా రాయ్ కపూర్.. వాళ్లిద్దరూ చాలా ఫన్నీ’ అని రణ్‌బీర్ చెప్పాడు. ‘ఇటీవల వచ్చిన సినిమాల్లో ఏ పాత్రని మీరు చేయాలనుకుంటున్నారు?’ అని అడగగా.. ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) పాత్ర పుష్పరాజ్. తగ్గేదే లే’ అని తెలిపాడు. ‘మీరు అయాన్ ముఖర్జీ, అలియా భట్‌ల్లో ఎవరితో ఐలాండ్ ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు?’ అని అడగగా.. రణ్‌బీర్ ఆలోచించి.. ‘ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli)తో ఓ సోలో హీరోగా ఓ సినిమా చేయాలని ఉంది. ఆ మూవీ షూటింగ్ ఐలాండ్‌లో ఉండాలి’ అని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-07-14T21:40:21+05:30 IST