Shamshera Collections: రణ్‌బీర్ కపూర్ సినిమాకు ఇలాంటి పరిస్థితేంటి..? రూ.150 కోట్ల బడ్జెట్‌ పెడితే.. 4 రోజుల్లో వచ్చింది కేవలం..

ABN , First Publish Date - 2022-07-26T20:00:39+05:30 IST

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన చిత్రం ‘షంషేరా (Shamshera)’...

Shamshera Collections: రణ్‌బీర్ కపూర్ సినిమాకు ఇలాంటి పరిస్థితేంటి..? రూ.150 కోట్ల బడ్జెట్‌ పెడితే.. 4 రోజుల్లో వచ్చింది కేవలం..

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన చిత్రం ‘షంషేరా (Shamshera)’. 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో నడిచితే ఈ మూవీలో వాణి కపూర్, సంజయ్ దత్ (Sanjay Dutt) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే ఎంతో బజ్ క్రియేటైన ఈ మూవీ జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.


అయితే.. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదలైన ఈ మూవీ మొదటిరోజే మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు (Collections) సైతం ఊహించిన దానికంటే దారుణంగా వచ్చాయి. మొదటి రోజు కేవలం రూ.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. మొత్తం నాలుగు రోజులకి కలిపి కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు అంచనా. దీనికి సంబంధించి ప్రముఖ సినీ విశ్లేషకుడు అభిషేక్ పరిహార్ ట్వీట్ చేశాడు. అందులో.. ‘ మొదటి సోమవారం షంషేరా కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 15% ఆక్యుపెన్సీని సాధించడంలో కూడా విఫలమైంది. కనిష్టంగా 6% ఆక్యుపెన్సీతో రోజును ప్రారంభించి.. మధ్యాహ్నం కేవలం 8% నుంచి 12% మధ్యలో ఊగిసలాడింది. ఓపెనింగ్ వీకెండ్ - 31.75 కోట్లు, మొదటి సోమవారం - 3.25 కోట్లు (అంచనా). నాలుగు రోజుల్లో మొత్తం - 35 కోట్లు (అంచనా) కలెక్ట్ చేసింది. వసూళ్లు పూర్తిగా డల్ అయిపోయాయి’ అని రాసుకొచ్చాడు.


సినిమాలో రణబీర్ కపూర్ నటన బాగుంది. కానీ.. ఈ ప్రాజెక్ట్ కొంతకాలం ఆలస్యమవ్వడం, కథ పాతది కావడం మూవీ మీద ప్రభావం చూపినట్లు విమర్శకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. సంజయ్ దత్ క్యారెక్టర్‌ని బాగా రాయలేదని.. రణ్‌బీర్, వాణీ కపూర్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ సెట్ కాలేదని టాక్ వినిపించింది. ట్రెండ్స్‌ని బట్టి చూస్తే ఈ సినిమా రూ.50 కోట్లకు వసూళ్లని సాధించే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు. అంటే దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమషా, బాంబే వెల్వెట్, జగ్గా జాసూస్ సినిమాల తర్వాత రణ్‌బీర్ సినిమాల్లో ఈ మూవీనే ఇంత దారుణమైన కలెక్షన్లని సాధించింది. దీంతో.. ఈ మూవీని నిర్మించి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఆశలన్నీ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా.. రణ్‌బీర్ కపూర్ సైతం తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్రం’పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సెప్టెంబర్ 9న విడుదలకానున్న ఈ మూవీ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీ అలియా భట్, టాలీవుడ్ హీరో నాగార్జున కీలకపాత్రల్లో నటించారు.



Updated Date - 2022-07-26T20:00:39+05:30 IST