Ranbir Kapoor: ఆమె భంగిమలతో నాకు నిద్రాభంగం

ABN , First Publish Date - 2022-09-27T01:40:12+05:30 IST

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు.

Ranbir Kapoor: ఆమె భంగిమలతో నాకు నిద్రాభంగం

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు. ఆలియా, రణ్‌బీర్‌కు ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో పరిచయం అయింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఏడేళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఆలియాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను రణ్‌బీర్ మీడియాతో పంచుకున్నాడు. 


ఆలియాను సహిస్తున్నానని రణ్‌బీర్ కపూర్ చెప్పాడు. ప్రతి రోజు తన నిద్రకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నాడు. ‘‘బెడ్ మీద ఆలియా తిన్నగా పడుకోదు. అటు, ఇటు జరుగుతుంటుంది. అప్పుడు బెడ్ మీద స్థలం కుంచిచుకుపోతుంటుంది. ఆమె తల ఒక దగ్గర ఉంటుంది. కాళ్లు మరో దగ్గర ఉంటాయి. నిద్ర లేచే సమయానికి నేను బెడ్ మూలకు చేరుకుంటాను. ఈ ఒక్క విషయంలో నేను నిజంగా ఇబ్బంది పడుతున్నాను’’ అని రణ్‌బీర్ చెప్పాడు. రణ్‌బీర్ మౌనం అంటే తనకిష్టమని ఆలియా భట్ చెప్పింది. ‘‘రణ్‌బీర్ తక్కువగా మాట్లాడుతాడు. ఎక్కువగా వింటాడు. అందుల్ల రణ్‌బీర్ మౌనమంటే నాకిష్టం. కొన్ని సందర్భాల్లో ఆ మౌనమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది’’ ఆలియా స్పష్టం చేసింది. బీ టౌన్ సెలబ్రిటీ దంపతులైన ఆలియా, రణ్‌బీర్ తాము తల్లిదండ్రులు కాబోతున్నామని జూన్‌లో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ మొదటి సారిగా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) లో  నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించాడు. రూ.410కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదలైంది. బాలీవుడ్‌లోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.250కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

Updated Date - 2022-09-27T01:40:12+05:30 IST