Ranbir Kapoor: రొమాన్స్ చేయకున్న పర్వాలేదు.. తను నా పక్కన లేకుంటే మాత్రం..

ABN , First Publish Date - 2022-09-18T18:57:46+05:30 IST

దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) ఈ ఏడాది ఏప్రిల్ 14న..

Ranbir Kapoor: రొమాన్స్ చేయకున్న పర్వాలేదు.. తను నా పక్కన లేకుంటే మాత్రం..

దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై మూడు నెలలు గడవకముందే ఆలియా గర్భవతి కూడా అయ్యింది. ఈ భార్యభర్తలు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం చాలా కొద్దిమంది అతిథుల మధ్య కొన్ని నెలల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ తరుణంలోనే దంపతుల చిత్రం విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భార్య ఆలియా భట్‌తో బంధంపై రణ్‌బీర్ కపూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.


ఆ ఇంటర్వ్యూలో యాంకర్ నిజ జీవితంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారా లేక ఇండిపెండెంట్‌గా ఎవరి పనులు వారు చేసుకుంటారా అని యాంకర్ అడిగాడు. దానికి ‘నేను ఇండిపెండెంట్‌గా, డిటాచ్‌గా ఉంటానని అందరికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. కానీ అది నిజం కాదు. నేను చాలా ఎక్కువగా ఆలియా మీద ఆధారపడతాను. అలియా ఎక్కడ ఉందో తెలియకపోతే నేను బాత్రూమ్‌కి వెళ్లను లేదా ఏది తినను. ఆమె నా పక్కన ఉండడం నాకు చాలా చాలా ముఖ్యం. మేము రొమాంటిక్‌గా ఏం చేయకపోయినా.. కనీసం మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ ఆమె నా పక్కనే కూర్చోవాలి’ అని రణ్‌బీర్ చెప్పుకొచ్చాడు.


అయితే.. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ఆలియా ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’  హలీవుడ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆ మూవీ షూటింగ్‌లో ఆలియా పాల్గొంది. అనంతరం ముంబైకి తిరిగి వస్తున్న తరుణంలో భార్యని రిసీవ్ చేసుకోడానికి రణ్‌బీర్ విమానాశ్రయానికి వెళ్లాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే కారులో తన కోసం ఎదురు చూస్తున్న రణ్‌బీర్‌ని చూసి ఉద్వేగంగా బేబీ అని అరుస్తూ గట్టిగా కౌగిలించుకుంది. 


కాగా.. రణ్‌బీర్, ఆలియా తాజా చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో రూ.200 కోట్లకి పైగా వసూళ్లని సాధించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, టాలీవుడ్ నటుడు నాగార్జున కీలకపాత్రల్లో నటించారు. మోహన్ భార్గవ పాత్రలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశాడు.

Updated Date - 2022-09-18T18:57:46+05:30 IST