Brahmastra: మీకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇదేంటంటూ రణ్‌బీర్ కపూర్‌పై నెటిజన్ల ఆగ్రహం..

ABN , First Publish Date - 2022-09-08T18:37:08+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhat) జంట ఒకటి.

Brahmastra: మీకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇదేంటంటూ రణ్‌బీర్ కపూర్‌పై నెటిజన్ల ఆగ్రహం..

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhat) జంట ఒకటి. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 ఈ జంట పెళ్లి చేసుకోగా.. మూడు నెలలు తిరగకముందే ఈ ఆలియా నెలతప్పింది. ఈ తరుణంలోనే ఈ దంపతులు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’ విడుదలకి సిద్ధమైంది. దీంతో ఆలియా గర్భంతోనే రణ్‌బీర్‌తో కలిసి ఆ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ జంట ఈ సినిమా కోసమే దాదాపు ఐదేళ్లు కేటాయించడంతో.. సక్సెస్ కోసం దేశంలోని పలు నగరాలకు వెళ్లి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా అవిశ్రాంతంగా వివిధ నగరాలకు వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో ఆలియాకి వెన్నునొప్పి వచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు ఇది చాలా సాధారణ విషయం. కానీ.. రెస్ట్ లేకుండా తిరుగుతుండడమే ఇక్కడ ఇబ్బంది కలిగించే విషయం. దీంతో రణ్‌బీర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ జంట తమ సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో ఈ జంట మీడియా కంటపడింది. దీంతో కొందరూ ఫొటోగ్రాఫర్లు వెళ్లి వారిని స్టిల్స్ ఇవ్వమని కోరారు. కానీ.. ఆలియాకి వెన్ను నొప్పి వస్తుందని చెప్పి మర్యాదపూర్వకంగా వారి అభ్యర్థనని తిరస్కరించాడు. వారు ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆలియాకి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన పలువురు నెటిజన్లు రణ్‌బీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ‘ఏంటి రణ్‌బీర్ ఇది.. ఆలియా ఆరోగ్యం ముఖ్యం కదా’, ‘సినిమా కంటే ఆలియా ముఖ్యం కదా రణ్‌బీర్’, ‘పెళ్లైన దగ్గర నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. కొంచెం రిలాక్స్ అవ్వండి’ అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. మరొకరైతే ‘ప్రెగ్నెన్సీని ప్రచారం చేసుకోవడం బాలీవుడ్‌లో ఫ్యాషన్ అయిపోయింది’ అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.



Updated Date - 2022-09-08T18:37:08+05:30 IST