Brahmastra Twitter Review: రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ మూవీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-09-09T15:04:43+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’..

Brahmastra Twitter Review: రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ మూవీ ఎలా ఉందంటే..

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra Part 1: Shiva). నూతన దంపతులు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియాభట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాతగా వ్యవహారించిన ఈ మూవీలో.. అమితాబ్‌బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలోనే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ని అందుకుని ఆ అంచనాలకు భారీగా పెంచేశాయి.


ఈ సమయంలోనే బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే అతిథి పాత్రల్లో మెరవనున్నారనే టాక్ రావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే.. ఇదే సమయంలో పలు కారణాల వల్ల ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయినా ఈ సినిమా బజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ తరుణంలో ఈ మూవీ ఈరోజు (సెప్టెంబర్ 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పలు చోట్ల ఇప్పటికే ప్రిమియర్ షోలు పడిపోయాయి. దీంతో ఎంతోమంది నెటిజన్లు రివ్యూని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.


రణ్‌బీర్, ఆలియా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా బాగా నటించారు. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ సూపర్. కథ, కథనం బావున్నాయి. సినిమా చాలా క్లాసిక్‌గా ఉంది. అయాన్ ముఖర్జీ చాలా జాగ్రత్తగా, అందంగా సినిమాని తీశాడు. ఇది చూసిన తర్వాత సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. రణ్‌బీర్ సూపర్ హిట్ సినిమాతో వచ్చి బాలీవుడ్‌కి మళ్లీ ఊపిరిపోశాడు.. అంటూ అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా ఈ సినిమాపై వారి రివ్యూ ఏంటో చూద్దాం..

















Updated Date - 2022-09-09T15:04:43+05:30 IST