Brahmastra: తన రికార్డుని తానే బద్దలు కొట్టిన రణ్‌బీర్ కపూర్!

ABN , First Publish Date - 2022-09-12T17:58:30+05:30 IST

బాలీవుడ్‌తోపాట దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్.. చాలా ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’...

Brahmastra: తన రికార్డుని తానే బద్దలు కొట్టిన రణ్‌బీర్ కపూర్!

బాలీవుడ్‌తోపాట దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్.. చాలా ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు ఐదేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే.. రిలీజైన మొదటి రోజే ఈ మూవీపై మిక్స్‌డ్ రివ్యూలను వచ్చాయి. విఎఫ్ఎక్స్ హలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉన్నాయి.. కానీ కథ, కథనం పేలవంగా ఉన్నాయంటూ పలువురు సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.


అయినప్పటికీ కలెక్షన్లపరంగా ‘బ్రహ్మాస్త్ర’ ఏమాత్రం వెనక్కి తగట్లేదు. విడుదలైన మొదటి రోజు దాదాపు రూ.36 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండో రోజు సైతం రూ.45 కోట్లకి పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. సెలవు రోజైన ఆదివారమైతే దాదాపు రూ.47 కోట్ల వరకూ వసూళ్లు సాధించిందట. అంటే.. మొత్తం మూడు రోజుల్లోనే దాదాపు రూ.125 కోట్ల వరకూ కొల్లగొట్టిందట. ఇది రణ్‌బీర్ గత చిత్రం సంజు మొదటి వారాంతపు వసూళ్లు రూ.120 కోట్లకంటే ఎక్కువ. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు సుమిత్ కాదెల్ ఓ ట్వీట్ చేశాడు.


సుమిత్ చేసిన ట్వీట్‌లో.. ‘బ్రహ్మాస్త్ర విడుదలైన అన్ని భాషల్లో కలిపి ఆదివారం రూ. 45 - 47 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అంటే వారాంతపు మొత్తం రూ.125 కోట్లు. ఇది సంజు (రూ.120 కోట్లు) వారాంతపు కలెక్షన్లని అధిగమించి.. హిందీ చలనచిత్రం ఆల్ టైమ్ బిగ్గెస్ట్ వీకెండ్ రికార్డ్‌లను నెలకొల్పింది. అంటే రణబీర్ కపూర్ తన రికార్డును తానే అధిగమించాడు’ అని రాసుకొచ్చాడు. అయితే.. ఈ సినిమా కలెక్షన్లపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయి. ఈ చిత్రబృందం కావాలనే తక్కువ కలెక్షన్లని ఎక్కువ చేసి చూపుతూ.. కొంతమందితో ఇలా చెప్పిస్తుందని నెటిజన్లు విమర్శలు సైతం చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది.



Updated Date - 2022-09-12T17:58:30+05:30 IST