Brahmastra: ఆకట్టుకుంటోన్న ‘దేవ దేవ’ సాంగ్

ABN , First Publish Date - 2022-08-09T05:08:31+05:30 IST

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర: మొదటి భాగం - శివ’ (BRAHMASTRA Part One: Shiva). పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా

Brahmastra: ఆకట్టుకుంటోన్న ‘దేవ దేవ’ సాంగ్

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర: మొదటి భాగం - శివ’ (BRAHMASTRA Part One: Shiva). పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ‘దేవ దేవ’ అనే సాంగ్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘కుంకుమల’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలవగా.. ఇప్పుడు విడుదల చేసిన ‘దేవ దేవ’ (Deva Deva) సాంగ్ కూడా అప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆధ్యాత్మికంగా అలాగే ఉల్లాసభరితంగా సాగిన ఈ పాటను ప్రీతమ్ (Pritam) స్వరపరచగా.. చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర (Sreerama Chandra), జోనితా గాంధీ (Jonita Gandhi) ఆలపించారు. 


పాట విడుదల సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “నాకు ఈ పాట చాలా ఇష్టం. వ్యక్తిగతంగా ఈ పాట నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ పాట విన్నాక నేను ఎలా అయితే ఫీలయ్యానో.. అందరూ అలానే ఫీలవుతారని భావిస్తున్నాను..’’ అని తెలిపారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. “పాటను విడుదల చేయడానికి శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను. ఈ శుభ సందర్భంలో విడుదలైన ఈ పాట.. రణబీర్ పాత్రను తెలుపుతూ.. ఆధ్యాత్మిక దృశ్యాలతో ఉంటుంది. శివ, అతని అగ్ని శక్తిని అన్వేషిస్తుంది. ‘కుంకుమల’ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ పాట కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నాను.’’ అని తెలిపారు. శాస్త్రీయ మరియు భక్తి అంశాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఈ పాటని కంపోజ్ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరికీ ఈ పాట మరో ప్రపంచానికి వెళ్లిన అనుభూతిని ఇస్తుందని సంగీత దర్శకుడు ప్రీతమ్ తెలిపారు.



Updated Date - 2022-08-09T05:08:31+05:30 IST