Brahmastra: ఆస్ట్రేలియాలో బాలీవుడ్ మూవీ రికార్డు.. అదేంటంటే..

ABN , First Publish Date - 2022-09-25T19:36:30+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్.. చాలా ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’..

Brahmastra: ఆస్ట్రేలియాలో బాలీవుడ్ మూవీ రికార్డు.. అదేంటంటే..

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్.. చాలా ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు ఐదేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే.. రిలీజైన మొదటి రోజే ఈ మూవీపై మిక్స్‌డ్ రివ్యూలను వచ్చాయి. వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉన్నాయి.. కానీ కథ, కథనం పేలవంగా ఉన్నాయంటూ పలువురు సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.


అయినప్పటికీ కలెక్షన్లపరంగా ‘బ్రహ్మాస్త్ర’ ఏమాత్రం వెనక్కి తగట్లేదు. విడుదలైన మొదటి రోజు దాదాపు రూ.36 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండో రోజు సైతం రూ.45 కోట్లకి పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. సెలవు రోజైన ఆదివారమైతే దాదాపు రూ.47 కోట్ల వరకూ వసూళ్లు సాధించిందట. అంటే.. మొత్తం మూడు రోజుల్లోనే దాదాపు రూ.125 కోట్ల వరకూ కొల్లగొట్టింది. అది బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ రికార్డు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల వరకూ వసూళ్లు చేసింది. ఈ మూవీ తాజాగా మరో రికార్డుని సాధించింది.


ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ చిత్రంగా బ్రహ్మాస్త్ర ఇప్పుడు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ 1.56 డాలర్ల మిలియన్లు భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అంటే దాదాపు రూ.13 కోట్లు కలెక్షన్లు సాధించింది. దీనిపై మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది అద్భుతంగా అనిపించింది. ఇది పెద్ద మార్వెల్ చిత్రానికి మన భారతీయ వెర్షన్ కావడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-09-25T19:36:30+05:30 IST