Shamshera OTT release: నెల తిరక్కముందే ఓటీటీలోకి రణ్‌‌బీర్ కపూర్ సినిమా.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-19T19:13:29+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న యువనటుల్లో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ఒకరు. ఈ చాక్లెట్ బోయ్ 2018లో

Shamshera OTT release: నెల తిరక్కముందే ఓటీటీలోకి రణ్‌‌బీర్ కపూర్ సినిమా.. ఎక్కడంటే..

బాలీవుడ్‌లోని మంచి పాపులారిటీ ఉన్న యువనటుల్లో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ఒకరు. ఈ చాక్లెట్ బోయ్ 2018లో వచ్చిన ‘సంజు’ చిత్రంలో సూపర్ హిట్ కొట్టాడు. అనంతరం దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం ‘షంషేరా (Shamshera)’. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ జులై 22న విడుదలైంది. అయితే.. ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. దీంతో నెలకూడా గడవకముందే ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది.


రణ్‌బీర్ కపూర్ మొట్టమొదటిసారి డ్యుయెల్ రోల్ పోషించిన ఈ చిత్రం ఈ రోజు (ఆగస్టు 19)న.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌(Amazon prime)లో విడుదలైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని బాలీవుడ్ బ్యూటీ, ఈ మూవీ హీరోయిన్ వాణీకపూర్ పోస్టు చేసింది. దానికి.. ‘ధైర్యసాహసాలు, సంకల్పం ఉన్న వీరోచిత కథ. ఇప్పుడే ప్రైమ్ వీడియోలో చూడండి’ అంటూ రాసుకొచ్చింది. సంజయ్‌దత్ (Sanjay Dutt) ముఖ్యపాత్రలో నటించిన ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. కాగా.. రణ్‌బీర్ నటించిన మరో చిత్రం ‘బ్రహ్మస్త్రం’ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆలియాభట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



Updated Date - 2022-08-19T19:13:29+05:30 IST