Boycott Brahmastra: అప్పటీ రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం.. ఇప్పుడు గుడిలోకి రానివ్వమంటూ..

ABN , First Publish Date - 2022-09-07T18:29:53+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’...

Boycott Brahmastra: అప్పటీ రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం.. ఇప్పుడు గుడిలోకి రానివ్వమంటూ..

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మూవీ టీం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


విడుదల దగ్గర పడిన ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహంకాళీ అమ్మావారి గుడికి పూజ చేయించేందుకు రణ్‌బీర్, ఆలియా, దర్శకుడు అయాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఈ స్టార్స్‌ని కొందరు నిరసనకారులు గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గత కొన్నేళ్ల క్రితం బీఫ్ గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వీరిని గుడిలోకి అనుమతించలేదు. దాంతో చేసేది ఏం లేక వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


దీంతో మరోసారి ‘Boycott Brahmastra’ కాన్సెప్ట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకుముందు కరణ్ జోహార్ నిర్మాత కావడం వల్ల.. అదే సమయంలో ఆలియా నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండని పొగరుగా మాట్లాడటంతో బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్ చేశారు. మరోసారి బీఫ్ కారణంగా బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో.. ఇతర స్టార్ సినిమాల్లాగే ఈ మూవీ కూడా ఫ్లాప్‌గా మిగులుతుందేమోనని చిత్రబృందం భయపడుతోంది.  కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సినీయర్ నటుడు నాగార్జున, నాగినీ ఫేమ్ మౌని రాయ్ కీలకపాత్రల్లో నటించారు.











Updated Date - 2022-09-07T18:29:53+05:30 IST