Ranbir Kapoor- Alia Bhatt Wedding: తండ్రి, కొడుకు సేమ్ టూ సేమ్.. 42ఏళ్ల క్రితం సీన్ రిపీట్

ABN , First Publish Date - 2022-04-15T20:49:08+05:30 IST

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే...

Ranbir Kapoor- Alia Bhatt Wedding: తండ్రి, కొడుకు సేమ్ టూ సేమ్.. 42ఏళ్ల క్రితం సీన్ రిపీట్

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహ వేడుక ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్  చేసిన అలియా అధికారికంగా మ్యారేజ్ గురించి ప్రకటించింది. అయితే ఈ పిక్స్‌తోపాటు ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఇతర ఫొటోలు నెట్టింట ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని షేర్ చేసింది.

 

ఆ స్టోరీలో.. తాజాగా పెళ్లి చేసుకున్న రణ్‌బీర్, అలియా కలిసి షాంపైన్ తాగుతున్న పిక్ ఉంది. అలాగే మరోవైపు 1980లో అంటే 42 ఏళ్ల క్రితం అదేవిధంగా పెళ్లి రోజున షాంపైన్ తాగుతున్న రిషి కపూర్, నీతూ కపూర్ ఫొటో కూడా ఉంది. దీన్ని ఓ ఫ్యాన్ క్లబ్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మెల్లగా ఈ పిక్ నీతూకి చేరింది. దీంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసింది.


అలాగే.. పెళ్లి కొడుకు డ్రెస్‌లో ఉన్న కుమారుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఉన్న పిక్‌ని కూడా నీతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి.. ‘దీన్ని రిషి కపూర్ సాబ్‌కి అంకితమిస్తున్నాను. మీ కోరిక నేరవేరింది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై ఎంతోమంది అభిమానులు మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-15T20:49:08+05:30 IST