Brahmastra: సినిమాకి ఫ్లాప్ టాక్.. రెండో రోజు కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-11T14:42:41+05:30 IST

చాలాకాలంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎదురుచూసిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్..

Brahmastra: సినిమాకి ఫ్లాప్ టాక్.. రెండో రోజు కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే..

చాలాకాలంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎదురుచూసిన మూవీ ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహారించాడు. దాదాపు ఐదేళ్లపాటు నిర్మాణంలో ఉన్న ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్ల కలెక్షన్లని సాధించింది. కరోనా పాండమిక్ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే.. విడుదలైన మొదటిరోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.



ఈ తరుణంలో రెండో రోజుల కలెక్షన్లు భారీగా పడిపోతాయని అందరూ భావించారు. కానీ.. అందుకు విరుద్ధంగా 10 నుంచి 15 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు సుమిత్ కాదేల్ ఓ ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘బ్రహ్మాస్త్ర మూవీ శనివారం కలెక్షన్లు రూ.40 కోట్లు నెట్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. చాలా కేంద్రాల్లో దాదాపు 10 నుంచి 15 శాతం కలెక్షన్లు పెరిగాయి. అన్ని భాషల్లో కలిపి రెండో రోజుల రూ.40 నుంచి 43 కోట్ల మధ్యలో వసూళ్లు సాధించే అవకాశం ఉంది’ అని రాసుకొచ్చాడు. దీంతో.. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.75 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి.. వారంతానికి సంబంధించి కరోనాకి ముందు సంజు, టైగర్ జిందాహై, ధూమ్ 3 రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.


అంతేకాకుండా.. కేవలం హిందీలోనే దాదాపు రూ.39 కోట్ల వసూళ్లు సాధించినట్లు మరో సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీకెండ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, టాలీవుడ్ నటుడు నాగార్జున, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించారు.  





Updated Date - 2022-09-11T14:42:41+05:30 IST