Brahmastra: మరో మూడు రోజుల్లో రిలీజ్ అనగా.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మాస్త్ర టీమ్..!

ABN , First Publish Date - 2022-09-06T21:15:44+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’...

Brahmastra: మరో మూడు రోజుల్లో రిలీజ్ అనగా.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మాస్త్ర టీమ్..!

బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నటుడు నాగార్జున, నాగిని ఫేమ్ మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. అయితే తాజాగా అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్, ఆలియా ఇతర ప్రముఖుల ప్రత్యేకంగా షో వేసుకుని 3డిలో సినిమా చూశారు. ఈ సందర్భంగా వారు ముగ్గురు కలిసి ఓ వీడియో రికార్డు చేశారు. అందులో అభిమానులకు బిగ్ సర్‌ఫ్రైజ్ అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని ఈ మూవీ నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అందులో.. వారు మొదటి సారి ఈ సినిమాని 3డిలో చూస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అదేంటంటే.. తమ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ షో వేసి రణ్‌బీర్, ఆలియా వారితో కలసి సినిమా చూడనున్నారు. అలాగే.. ఆ వీడియోలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 8న, అది నా లక్కీ నంబర్. మేము ప్రత్యేకంగా అభిమానుల కోసం ఓ షో వేయనున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. అది కేవలం ముంబైలో మాత్రమేనని అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. చాలా ఎగ్జాయిటెడ్‌గా ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటిలాగే.. ‘సినిమా ఫ్లాప్’ అంటూ విమర్శలు సైతం చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.



Updated Date - 2022-09-06T21:15:44+05:30 IST