Virata Parvam: మరోసారి విడుదల తేదీ మారింది.. ఈసారి ముందే!

ABN , First Publish Date - 2022-05-30T23:15:54+05:30 IST

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో.. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై..

Virata Parvam: మరోసారి విడుదల తేదీ మారింది.. ఈసారి ముందే!

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిప‌ల్లవి (Sai Pallavi) జంట‌గా.. వేణు ఊడుగుల (Venu Udugula) ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న  చిత్రం ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో.. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri ) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం విషయంలో అనేకానేక వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో కాదని, నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారనేలా కూడా వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు అధికారికంగా చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కంటే ముందుగానే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం జూలై 1న కాదు, జూన్ 17నే థియేటర్లలో విడుదల కాబోతోందని తెలుపుతూ.. సోమవారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.


‘‘ప్రేమ, విప్లవం కలిసిన చారిత్రక గాథ ముందుగానే ప్రారంభమవుతుంది. ‘విరాటపర్వం’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదలకానుంది’’ అని హీరో రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా విడుదల తేదీని ప్రకటించారు. కాగా, 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది దర్శకుడు వేణు రూపొందించిన ఈ చిత్రంలో.. రానా కామ్రేడ్ రవన్న (Ravanna) పాత్రను పోషించారు. వెన్నెల (Vennela) పాత్రలో సాయిపల్లవి  కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని యూనిట్ తెలుపుతుంది. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి  సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



Updated Date - 2022-05-30T23:15:54+05:30 IST