‘భీమ్లానాయక్‌’‌తో హీరో అంటే ఏంటో తెలుసుకున్నా: రానా దగ్గుబాటి

ABN , First Publish Date - 2022-03-03T01:26:54+05:30 IST

నా ఎక్స్‌పోజ్‌ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్‌ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటే వ్యక్తి పవన్‌కల్యాణ్‌గారు కూడా‌. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. కానీ, ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా..

‘భీమ్లానాయక్‌’‌తో హీరో అంటే ఏంటో తెలుసుకున్నా: రానా దగ్గుబాటి

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్‌. కె చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి.. బుధవారం మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘భీమ్లానాయక్‌ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్‌ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్‌ మీడియాలో సినిమా సూపర్‌హిట్‌ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది. కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్‌ వచ్చి ఇలాంటి జానర్‌ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్‌ పర్సన్‌. ఏం మాట్లాడినా.. చాలా విలువైన మాటలాగా ఉంటుంది. బోలెడంత నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. భాష, సంస్కృతి మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌ గార్ల వల్ల చాలా నేర్చుకున్నా. త్రివిక్రమ్‌ గారితో పనిచేయడం చాలా హ్యాపీ. కేరళ కథలకు, అక్కడి మనుషుల తీరు, సంస్కృతి మనతో పోల్చితే డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరు. అలాంటి నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్‌ అయ్యేలా మార్పులు చేర్పులు చేశారు. ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో రాబర్డ్‌డౌనీ పాత్ర ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ నాకు. అందులో వాడు నచ్చని పనులు చేస్తాడు కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకు డ్యాని పాత్రకు సిమిలర్‌గా అనిపించింది. ఈ సినిమా అనుకోగానే డ్యాని పాత్రకు ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగా. 


నా ఎక్స్‌పోజ్‌ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్‌ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటే వ్యక్తి పవన్‌కల్యాణ్‌గారు కూడా‌. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. కానీ, ఈ సినిమా అనుకున్నాక ఆయన గురించి చాలా తెలుసుకున్నా. ఆయనకు బాగా కనెక్ట్‌ అయిపోయా. సెట్‌లో ఆయన ఉంటే ఉండే ఎనర్జీనే వేరు. చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి. నేను విభిన్న కథలు ఎంచుకుంటాననే టాక్‌ ఉంది. చాలామంది రకరకాల రీజన్‌లతో యాక్టర్లు అవుతారు. నేను యాక్టర్‌ అయింది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని. అలా ఉండడం కోసం నటనలో చాలా మెళకువలు తెలుసుకున్నా. అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్‌ అవ్వలేను. మాస్‌ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్‌కల్యాణ్‌‌గారిని చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కల్ట్‌ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది..’’ అని తెలిపారు. 

Updated Date - 2022-03-03T01:26:54+05:30 IST