RRRతో R: వైరల్ అవుతోన్న పిక్

ABN , First Publish Date - 2021-12-22T22:17:09+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు

RRRతో R: వైరల్ అవుతోన్న పిక్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తోన్న చిత్రం.. అలాగే టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు రాజమౌళితో పాటు తారక్, చరణ్‌లు కొన్ని రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు.


కాగా, ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ‘RRR’ టీమ్‌కి మరో ‘R’ పేరు గల హీరో యాడ్ అయ్యారు. ఈ ‘R’ ఎవరో కాదు.. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో భళ్లాలదేవుడిగా విశ్వరూపం ప్రదర్శించిన రానా దగ్గుబాటి. ‘‘ఈ ఉదయం ముంబైలో ప్రతిష్టాత్మకమైన ‘RRR’లతో మరో ‘R’ ’’ అని తెలుపుతూ రాజమౌళి, రామ్ చరణ్, రామారావులతో ఉన్న పిక్‌ని రానా దగ్గుబాటి పోస్ట్ చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



Updated Date - 2021-12-22T22:17:09+05:30 IST